Sunday, November 16, 2025
HomeదైవంShravana Masam: శ్రావణంలో శని-గురు స్థానాల్లో పెను మార్పు.. ఈ రాశులవారు రాత్రికిరాత్రే కుబేరులవ్వడం ఖాయం..

Shravana Masam: శ్రావణంలో శని-గురు స్థానాల్లో పెను మార్పు.. ఈ రాశులవారు రాత్రికిరాత్రే కుబేరులవ్వడం ఖాయం..

Shravana Masam 2025 effect: గ్రహాలు, నక్షత్రాల కదలికలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఉత్తర భారత పంచాంగం ప్రకారం, ఇప్పటికే శ్రావణ మాసం మెుదలైపోయింది. ఈ పవిత్రమైన మాసంలో దేవగురు బృహస్పతి, కర్మఫలదాత శని స్థానంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇవాళ(జూలై 13) శనిదేవుడు మీనరాశిలో తిరోగమించనున్నాడు. అదే స్థితిలో నవంబరు 28 వరకు ఉంటాడు. ఇదే సమయంలో గురువు మిథునరాశిలో లగ్న స్థితిలో సంచరించబోతున్నాడు. గురు-శని గ్రహాల స్థాన మార్పు మూడు రాశులవారికి ఊహించని సంపదను, కీర్తిని ఇవ్వబోతుంది. ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

- Advertisement -

తుల రాశి
శనిదేవుడు సంచారం తులా రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ పుల్ అవుతారు. మీ రకరకాల మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ జీవిత భాగస్వామి మంచి సమయం గడుపుతారు. మీ ప్రణాళికాలన్నీ ఫలిస్తాయి. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మహాదేవుడు ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు జీవిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలను పొందుతారు. మీరు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. ఆర్థికంగా పై మెట్టుకి వెళతారు అప్పుల భారం నుంచి బయటపడతారు.

వృషభ రాశి
శ్రావణ మాసంలో గురు-శని గ్రహాల స్థాన మార్పు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశివారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ మనోవేదనలన్నీ తొలగిపోతాయి. మీకు ప్రతి విషయంలో ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. భార్యభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీకు దైవ భక్తి పెరుగుతుంది. సొంత వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీ కోరికలు నెరవేరుతాయి.

సింహ రాశి
సింహరాశి వారికి శివుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. మీ తెలివితేటలతో కంపెనీలను లాభాలబాట పయనిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ దూరదృష్టి మీకు సత్ఫలితాలనిస్తుంది. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపిస్తాయి. శ్రావణ మాసంలో పెట్టే పెట్టుబడులు మీకు భారీగా లాభాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ వర్క్ కు ప్రశంసలు లభిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad