Shani Guru Vakri effect on Zodiacs: దేవతల గురువైన బృహస్పతి ఇవాళ కర్కాటక రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. అదే స్థితిలో మార్చి 11 వరకు ఉంటాడు. అయితే ఈ మధ్యలోనే అంటే డిసెంబర్ 5న గురుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. మరోవైపు మీనంలో తిరోగమన స్థితిలో కూర్చొన్న శని నవంబర్ నెల చివరిలో మార్గంలోకి రాబోతున్నాడు. గురుడు మరియు శని యెుక్క ఈ మార్పుల వల్ల కొన్ని రాశులవారు బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మకర రాశి
శని, బృహస్బతి సంచారం మకర రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఏదైనా వ్యాపారం మెుదలుపెట్టాలన్నా లేదా ఉద్యోగం చేయాలనుకున్నా ఇదే మంచి సమయం. పార్టనర్ షిప్ తో చేసే బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. కెరీర్ లో సానుకూల ప్రభావం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు విజయం సాధిస్తారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశీయానం ఉంది.
తులా రాశి
బృహస్పతి తిరోగమనం, శని మార్గం తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ సంపద అమాంతం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. ఏదైనా వాహనం లేదా ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. లక్ ఎల్లప్పుడూ మీ తోటే ఉంటుంది. పిల్లల కోసం ఎదురుచూసేవారి కల ఫలిస్తుంది. ఆధ్యాత్మికతపై వైపు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు లాభపడతారు.
Also read: Mercury Transit 2025 -రేపటి నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
మీన రాశి
మీన రాశి వారికి శని, గురుల సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఉద్యోగ లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ బంధువులతో సంబంధాలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు మళ్లీ మెుదలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. గత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.


