Shani Nakshtra Transit 2025: కర్మలకు అధిపతి అయిన శని దేవుడు జన్మాష్టమి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. 27 ఏళ్ల తర్వాత శని ఈ నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. ఈ ఘటన ఆగస్టు 18, సోమవారం నాడు జరగబోతుంది. శనిదేవుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. శని యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి అద్భుతంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
శని నక్షత్ర మార్పు సింహరాశి వారికి ఎంతో మేలు చేయనుంది. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు వేసుకున్న ఫ్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి.
కన్యారాశి
శనిదేవుడు నక్ష్రత మార్పు కన్యారాశివారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలన్న మీ కోరిక నెరవేరుతోంది. శనిదేవుడు ఆశీస్సులు మీపై మెండుగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు.
వృషభ రాశి
శని నక్షత్ర సంచారం వల్ల వృషభరాశి వారు మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. వీరు కెరీర్ లో ఎన్నడూ చూడని పురోగతిని చూస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ అత్తమామలతో మంచి సంబంధాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి సపోర్టు లభిస్తుంది. మిమ్మల్ని అదృష్టంతోపాటు ఐశ్వర్యం వరించనుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ఫలితాలను చూస్తారు.
Also Read: Sun transit 2025- కేతు నక్షత్రంలోకి సూర్యుడు.. ఆగస్టులో ఈ 3 రాశులు ముట్టిందల్లా బంగారం..
మిథున రాశి
మిథున రాశి వ్యక్తులకు శని నక్షత్ర సంచారం మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగాలకు సిద్దమయ్యే వారు సక్సెస్ అవుతారు. ఎంతో కాలంగో ఎదురుచూస్తున్న మీ కోరిక నెరవేరుతోంది. సొంత వ్యాపారం చేసేవారుకు అనుకోని లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీరు కెరీర్ లో మంచి ఎదుగుదల ఉంటుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితులు సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా పై కథనాన్ని రూపొందించడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also read: Raksha Bandhan 2025 – రాఖీని ఎప్పుడు తీయాలి? రాఖీని ఎక్కువ కాలం ఉంచుకోవచ్చా?


