Shani Surya yuti 2025 in November: గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిచక్రాన్ని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశుల్లో సంచరిస్తాడు. ఇతడిని ఆత్మ, హోదా, కీర్తి, లీడర్ షిప్, విజయం మెుదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడు త్వరలో వృశ్చిక రాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ క్రమంలో అతడు నవంబర్ 17న శనితో కలిసి శక్తివంతమైన నవపంచమ రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. ఇది 30 ఏళ్ల తర్వాత ఏర్పడబోతుంది. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారి తలరాత మారబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మీన రాశి
సూర్యుడు మరియు శని సృష్టిస్తున్న నవపంచమ రాజయోగం మీనరాశి వారి అదృష్టాన్నిమార్చబోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. మీ లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతమవుతారు. ఆర్థిక పరిస్థితి అద్బుతంగా ఉండబోతుంది. మీ ఫ్యూచర్ ఫ్లాన్స్ ఫలిస్తాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. సీనియర్ అధికారుల సపోర్టు లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
నవపంచమ రాజయోగం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. సొంత వ్యాపారం చేసుకునే వారు లాభపడతారు. మీ కెరీర్ లో ఊహించని ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సడన్ గా డబ్బు మీ చెంతకు చేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి.
Also Read: Dev Diwali 2025 – దేవ్ దీపావళి రోజున అరుదైన రాజయోగాలు.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
మకర రాశి
శని-సూర్యుడు చేస్తున్న రాజయోగం మకర రాశి వారికి శుభకరంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి మంచి స్థితిలో ఉంటుంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్నపనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. ఉద్యోగుల శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కెరీర్ లో విజయం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారులు అనుకూలిస్తాయి.


