Wednesday, January 14, 2026
HomeదైవంAstrology: ఒకే రోజు సంక్రాంతి-ఏకాదశి.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

Astrology: ఒకే రోజు సంక్రాంతి-ఏకాదశి.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

Shattila Ekadashi and Makar Sankranti coincide: జనవరి నెల పండుగలకు, వ్రతాలకు పెట్టింది పేరు. మాఘ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశినే షట్టిల ఏకాదశి అంటారు. కొత్త ఏడాదిలో ఈ పవిత్రమైన ఏకాదశి జనవరి 14న రాబోతుంది. పైగా ఇదే రోజు మకర సంక్రాంతి పండుగను కూడా జరుపుకోనున్నారు. రెండు పండుగలు ఒకే రోజు రావడం, గంగానదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత పెరిగింది. పైగా ఇదే రోజు సర్వార్థ సిద్ధి యోగంతోపాటు అమృత యోగం కూడా సంభవించబోతుంది. దీంతోపాటు ఇదే సమయంలో శుక్రాదిత్య యోగంతోపాటు నవపంచమ రాజయోగం కూడా ఏర్పడుతోంది. ఈ ఏకాదశి వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

కన్యా రాశి
సంక్రాంతి, ఏకాదశి కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు మీ తెలివితేటలతో ఎలాంటి కార్యాన్నైనా సులభంగా సాధించగలుగుతారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికుల మధ్య బంధం మరింత గట్టిపడుతుంది.

మకర రాశి
షట్టిల ఏకాదశి మకర రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. సమాజంలో మీ గౌరవం, హోదాతోపాటు ప్రతిష్ఠ పెరుగుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారు లాభపడతారు. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కెరీర్ లో ఊహించని మలుపు ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనార్జన చేస్తారు. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు.

Also Read: Kalashtami 2026 -కొత్త ఏడాదిలో తొలి కాలాష్టమి ఎందుకు ప్రత్యేకం!

వృషభ రాశి
మకర సంక్రాంతి వృషభ రాశి వారికి అద్బుతంగా ఉండబోతుంది. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతమవుతారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. కెరీర్ లో ఊహించని గ్రోత్ ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News