పాము పేరు వినగానే చాలా మందిలో భయభ్రాంతులు గురవుతుంటారు. సాధారణంగా పాము మనిషికి ఎదురుపడకూడదు అనుకుంటుందంట.. కానీ ఒక్కోసారి అవి ప్రాణభయంతో కాటు వేస్తుంటాయి.. దీంతో మనిషి శరీరంలోకి విషం చేరి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే వింటుంటాం. అయితే ఆశ్చర్యకరంగా ఉన్నా, కొన్ని మతసాంప్రదాయాలు, తాంత్రిక విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కొన్ని రకాల వ్యక్తులను పాములు కాటు వేయవు అనే నమ్మకాలు మన పురాణాల్లోనూ, ప్రజల నమ్మకాల్లోనూ ఉన్నాయి.
పాంచభౌతిక దైవాల్లో ఒకరైన భగవాన్ శివుడిని సర్పాధిపతిగా పరిగణిస్తారు. శివుని మెడలో భయంకరమైన పాము ఉంటుందని.. దాని పేరు వాసుకి అని శివపురాణం చెబుతోంది. శివుడు పాము విషాన్ని నిలుపుకునే శక్తిని కలిగినవాడిగా, ఆయనను అర్చించే భక్తులు కూడా ఆ అనుగ్రహాన్ని పొందతారని పురాణాల ఉవాచ. శివ భక్తులైన వారు, ముఖ్యంగా ప్రతిరోజూ శివ తాండవ స్తోత్రం, లేదా మహామృత్యుంజయ మంత్రం జపించేవారిని పాములు ఏమీ చేయవని చెబుతుంటారు.
ప్రత్యేకించి ప్రదోషం, మాస శివరాత్రి, మహాశివరాత్రి వంటి శుభదినాల్లో రుద్రాభిషేకం నిర్వహించినవారు శివుడి అనుగ్రహంతో విషజంతువుల నుండి రక్షణ పొందతారని హిందూ సంప్రదాయం చెబుతోంది.
అంతేకాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా, కొన్ని జాతకాల్లోని గ్రహస్థితులు పాముకాటు వంటి అపాయాల నుంచి మనిషిని దూరంగా ఉంచుతాయని చెప్పారు. ఉదాహరణకు, లగ్నేశుడు బలంగా ఉండటం, శని, రాహువు అనుకూలంగా ఉండటం వంటి అంశాలు దీనికి దోహదపడతాయి. అలాగే కళి సర్ప దోషం లేకపోవడం కూడా ఒక శుభలక్షణంగా పరిగణించబడుతుంది.
ఇక తాంత్రిక సంప్రదాయాల ప్రకారం కూడా, కొన్ని ప్రత్యేక మంత్రాలను నియమపూర్వకంగా జపిస్తూ తపస్సు చేసినవారిని పాములు వేధించవని, వారిని సర్పాలు ముందే గుర్తించి దారి మళ్లించుకుంటాయని అంటారు. పాము కూడా ఒక శక్తివంతమైన జీవి కావడం వల్ల, మానసిక శాంతి కలిగిన, శరీర తాపం తక్కువగా ఉన్నవారిని దాడి చేయదని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి.
ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలు కంటే, పునాది విశ్వాసం మీదే ఆధారపడినవి. అయితే ప్రజల అనుభవాలు, చారిత్రక సంఘటనలు ఈ నమ్మకాలకు బలాన్నిస్తూనే ఉన్నాయి. శివుని భక్తిగా నిత్యం సర్పభయాన్ని అధిగమించాలనే వారు శాంతియుత జీవనశైలి పాటిస్తూ, భక్తితో ఉండడం ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)