Sunday, November 16, 2025
HomeదైవంShravana Masam: నేటి నుండే శ్రావణ మాసం.. తొలి శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే మంచిది!

Shravana Masam: నేటి నుండే శ్రావణ మాసం.. తొలి శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే మంచిది!

- Advertisement -

Shravana Masam Started from today: హిందువులకు శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. అలాంటి ఈ పవిత్రమైన మాసం నేటి(జూలై 25) నుండి మెుదలుకానుంది. తెలుగు నెలల్లో ఐదో నెల ఈ శ్రావణం. పౌర్ణమి తిథి నుండి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటాడు, కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు. పైగా శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం కూడా.

నూరేళ్లు సౌభాగ్యం కోసం ఇలా చేయండి..

ఈ ఏడాది శ్రావణ మాసం శుక్రవారం నాడు ప్రారంభంకానుంది. పైగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో శుభప్రదమైనది. ఆ జగన్మాతకు మహిళలు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసంలో శివకేశవులను పూజించడం వల్ల మీ కోరికలన్నీ ఫలిస్తాయి.

సాధారణంగా శ్రావణ మాసాన్ని పూజల మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెలలో పండుగలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఎక్కువగా ఉంటాయి. సౌభాగ్యాన్ని అందించే ఈ మాసమంటే మహిళలకు ఎంతో ప్రీతికరం. పైగా ఇదే నెలలో వరలక్ష్మీదేవి వ్రతం కూడా వస్తుంది.

Also Read: Vinayaka Chavithi – 2025లో వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠ ఏ సమయంలో చేయాలి?

శ్రావణ శుక్రవారం పూజ

=>శ్రావణ మాసం తొలి శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి

=>ఆ తర్వాత పూజగదిని శుభ్రం చేసి..ఒక పీఠంపై అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టిలి.

=>పసుపు, కుంకుమ, పూలతో అమ్మవారిని ఆరాధించాలి.

=>పూజలో లక్ష్మీదేవికి స్వీట్లు, పండ్లతోపాటు పరమన్నం, పులగం నైవేద్యంగా పెట్టడం శుభప్రదం.

=>ఆ తర్వాత ధూప, దీప,తాంబూలను సమర్పించి..చివరిగా అమ్మవారికి హారతి పట్టండి.

=>ఈ పవిత్రమైన రోజున ఆ తల్లికి దీపం పెట్టడం మంచిదిగా భావిస్తారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad