Friday Lakshmi puja:మన జీవితంలో డబ్బు అనేది ఎంతో ముఖ్యమైన సాధనం. మనుషుల్ని నడిపించే యంత్రం అని చెప్పుకొవచ్చు.రోజు మొదలు అయినప్పటి నుంచి రోజు ముగిసే వరకు అన్నీ పనులు డబ్బుతోనే సాగుతాయి.రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు భద్రత ఇవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అందుకే చాలా మంది మహాలక్ష్మి దేవిని స్మరిస్తూ సంపద, శ్రేయస్సు పుష్కలంగా ఇవ్వమని కోరుకుంటారు.
ఆర్థిక సమస్యలు తగ్గి..
శుక్రవారం రోజును లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఆమెకు పూజ చేసి, ఓ చిన్న తాంత్రిక పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గి, డబ్బు ప్రవాహం పెరుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఈ పరిహారాన్ని ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. దీని కోసం పెద్ద ఏర్పాట్లు అవసరం ఉండవు.
ఒక తమలపాకు, ఐదు రూపాయల నాణెం, ఆకుపచ్చ కర్పూరం ఉంటే సరిపోతుంది. శుక్రవారం ఉదయం స్నానం చేసి, శుభ్రంగా దుస్తులు ధరించి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. మహాలక్ష్మి చిత్రాన్ని లేక విగ్రహాన్ని ముందు ఉంచి దీపం వెలిగించాలి.పూజ మొదలయ్యాక, లక్ష్మీదేవి ముందు ఒక తమలపాకును పరచాలి. ఆపై ఆ తమలపాకుపై ఐదు రూపాయల నాణెం ఉంచాలి.
మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి..
మీ దగ్గర పచ్చ కర్పూరం ఉంటే, దానిని కూడా ఆ నాణెంపై ఉంచాలి. దీని తరువాత మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లేదా కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలను చదువుకోవాలి. దీపం పూర్తయ్యేంత వరకు ఈ వస్తువులను లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. దీపం కొండెక్కిన తర్వాత తమలపాకు, నాణెం, కర్పూరాన్ని తీసి భద్రంగా ఉంచాలి. ఆ తమలపాకును మడిచి మీరు డబ్బు ఉంచే బీరువా లేదా క్యాష్ బాక్స్‌లో ఉంచాలి. ఇది ఆర్థికాభివృద్ధికి శుభప్రదంగా పండితులు చెబుతారు.
కొత్త తమలపాకును.
ఈ పరిహారాన్ని ప్రతి వారం శుక్రవారం చేయడం ఉత్తమం. ఇలా వారం వారం పూజ ప్రారంభించే ముందు పాత తమలపాకును తీసి బయట పవిత్ర ప్రదేశంలో ఉంచాలి. ఆపై కొత్త తమలపాకును మహాలక్ష్మి ముందు పరచి, పాత ఐదు రూపాయల నాణెంనే దానిపై ఉంచి పూజ చేయవచ్చు. ఇలా కొనసాగిస్తే, ఇంట్లో డబ్బు నిల్వగా ఉండి ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు.
మహాలక్ష్మి దేవిని ఆరాధించే శుక్రవారాలు శుభఫలితాలు ఇచ్చే రోజులుగా పండితులు వివరిస్తున్నారు. ఆ రోజున చేసే ఈ తాంత్రిక పరిహారం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మన కృషికి ఫలితాలు త్వరగా దక్కేలా చేస్తుందని నమ్మకం ఉంది. దేవిని స్మరిస్తూ చేసే ప్రతి పూజ మనసులోని ప్రతికూల భావనలను తొలగించి, శుభచింతనలను పెంపొందిస్తుంది.
ఈ పరిహారం కేవలం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రశాంతతకూ దారితీస్తుంది. పూజా సమయంలో మనసు కేంద్రీకరించి దేవిని స్మరించడం ద్వారా మనలో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి మార్గాలు విస్తరించడానికి మన ఆలోచనల్లో సానుకూలత పెరుగుతుంది.


