Friday, February 21, 2025
HomeదైవంSrisailam: శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Srisailam: శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam)లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంకాలం భృంగి వాహన సేవ ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. లోక కల్యాణం కోసం రుద్ర హోమం, చండీహోమం, జపాలు, పారాయణాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ రోజు సాయంత్రం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల వారి తరుపున శ్రీ స్వామి అమ్మ వార్లకు పట్టువస్త్రాల సమర్పణ ఉంటుంది. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఉంటుంది. ఈ గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ఆలయ దక్షిణ మాడ వీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివ దీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.

వైభవంగా బ్రహ్మెత్సవాలు ప్రారంభం
బుధవారం ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. యాగశాలలో అర్చకులు, వేదపండితులతో కలిసి ఈవో శ్రీనివాసరావు ప్రారంభ పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, రథోత్సవం, లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. రెండవ రోజు గురువారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు.

- Advertisement -


ఏర్పాట్లు పరిశీలించిన ఇన్చార్జి ఎస్పీ  విక్రాంత్ పాటిల్
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్  పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రత భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ  శ్రీశైలం దేవస్థానంలోని క్యూలైన్స్, గుడి పరిసరాలు, లడ్డు కౌంటర్ శివ స్వాముల క్యూ లైన్, స్నాన ఘట్టాలు, శ్రీకృష్ణ దేవరాయల గోపుర పరిసర ప్రాంతాలు ,రథ మండపం, కమాండ్ కంట్రోల్, శ్రీశైల డ్యామ్ సమీపంలోని ఘాట్ రోడ్డు మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు 
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News