Maha Shivaratri 2026:2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆధ్యాత్మికంగా అలాగే జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతి ఏడాది మాఘ మాసంలో వచ్చే మహా శివరాత్రి ఈసారి ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రోజున జరగనుంది. శివ భక్తులకు అత్యంత పవిత్రమైన ఈ పర్వదినం అనంతరం కేవలం రెండు రోజుల్లోనే సూర్యగ్రహణం ఏర్పడనుండటం వల్ల జ్యోతిష్య నిపుణులు దీనిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. శివరాత్రి వంటి ముఖ్యమైన పండుగ తర్వాత గ్రహణం రావడం వల్ల దాని ప్రభావం సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో భావిస్తారు.
మహా శివరాత్రి పర్వదినం..
మహా శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటల 34 నిమిషాల వరకు కొనసాగుతుంది. భక్తులు ఈ రోజున ఉపవాసాలు, జాగరణలు చేసి శివారాధనలో పాల్గొంటారు. అయితే ఈ పవిత్ర దినం పూర్తయ్యాక ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది.
Also Read:https://teluguprabha.net/devotional-news/navapanchama-raja-yoga-brings-fortune-to-five-zodiac-signs/
రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే ఈ గ్రహణం 12 రాశులపై కొంత మేర ప్రభావం చూపించినప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.జ్యోతిష్య పరంగా గ్రహణ కాలాన్ని సున్నితమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో జాగ్రత్త అవసరమని సూచిస్తారు.
మానసికంగా, ఆర్థికంగా ..
ముఖ్యంగా శివరాత్రి అనంతరం వచ్చే సూర్యగ్రహణం కావడంతో దాని ప్రభావం మానసికంగా, ఆర్థికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావితమయ్యే రాశుల వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచనలు ఉన్నాయి.
సింహ రాశికి..
సింహ రాశికి చెందిన వారికి ఈ కాలం కొంత సవాల్‌గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఊహించని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమతుల్యత దెబ్బతినే పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ లేదా పెద్ద పెట్టుబడులతో సంబంధం ఉన్నవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబంలో మాటపట్టింపులు, అపార్థాలు ఏర్పడి మానసిక ప్రశాంతత తగ్గే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో కూడా అనుకూలత తగ్గి ఓర్పుతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతరుల మాటలను సులభంగా నమ్మడం వల్ల నష్టపోయే పరిస్థితులు రావచ్చు. అందువల్ల ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం పెరిగి ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. ఈ సమయంలో మాటల విషయంలో కూడా సంయమనం పాటించడం మంచిదని సూచిస్తున్నారు.
కుంభ రాశి..
కుంభ రాశి వారికి శివరాత్రి తర్వాత వచ్చే సూర్యగ్రహణం ఆర్థికంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. రాహు, కేతు ప్రభావంతో ఆలోచనల్లో స్థిరత్వం తగ్గి నిర్ణయాల్లో అయోమయం ఏర్పడవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు రావడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపించవచ్చు. ఈ సమయంలో పెద్ద రిస్క్ ఉన్న నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/shukra-moudyami-end-date-and-auspicious-muhurthams-2026/
తుల రాశి..
తుల రాశి వారికి ఈ గ్రహణ కాలంలో ప్రయాణాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఆలస్యాలు లేదా అసౌకర్యాలు కలగవచ్చు. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో ఒత్తిడి పెరిగి మనశ్శాంతి తగ్గే పరిస్థితులు రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాగా ఆలోచించడం అవసరం. ఆర్థిక సమస్యలు రోజువారీ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

