Saturday, November 15, 2025
HomeదైవంSpiritual: కాలికి,చేతికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారంటే..!

Spiritual: కాలికి,చేతికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారంటే..!

Significance Of Black Thread: భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికీ ఒక లోతైన అర్థం దాగి ఉంటుందనే విషయం తెలిసిందే. మన దైనందిన జీవితంలో పాటించే ప్రతి పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుంది. అటువంటి ఆచారాలలో నల్ల దారానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకమైనది. చాలా మంది భక్తులు దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడి పూజారులు ఇచ్చే నల్ల దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటారు లేదా మెడలో వేసుకుంటారు. కొంతమంది కాళ్లకు కూడా కట్టుకుని కనిపిస్తుంటారు. కానీ ఈ దారం ఎందుకు కడతారు? దీని వెనక ఉన్న భావన ఏమిటి? అనే విషయాలు చాలా మందికి స్పష్టంగా తెలియవు.

- Advertisement -

నల్ల రంగుకు..

హిందూ సంప్రదాయంలో నల్ల రంగుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం నుంచి నల్ల రంగును దుష్టశక్తుల నుంచి రక్షణ కల్పించే చిహ్నంగా పెద్దలు చెబుతారు. చిన్న పిల్లల కళ్లకు కాటుక పెట్టడం నుంచి పెద్దవారికి నల్ల దారం కట్టించడం వరకు ఇదే నమ్మకం కొనసాగుతోంది. దృష్టిదోషం తగలకుండా ఉండేందుకు నల్ల రంగు ఉపయోగకరమని భావిస్తారు. నల్లదారం కడితే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీలు మన చుట్టూ తిరగవని చాలా మంది నమ్ముతారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/labubu-doll-craze-and-debate-on-its-effects/

ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఎక్కువకాలం కొనసాగితే పూజలు చేసే సమయంలో రోగికి నల్ల దారం కట్టడం అనే పద్ధతి చాలా చోట్ల ఇప్పటికీ కనిపిస్తుంది. ఇది ఆ వ్యక్తిపై ఉన్న చెడు శక్తులు తొలగి, ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. అలాగే వ్రతాలు, పూజలు చేసే సమయంలోనూ ఈ దారం ధరించడం ఒక ఆచారం లా మారిపోయింది.

పిల్లలు ఎడమ చేతికి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల దారం కట్టడానికీ కొన్ని నియమాలు ఉన్నాయని చెబుతారు. పురుషులు కుడి చేతికి కట్టుకోవడం శుభప్రదమని భావిస్తారు. మహిళలు, పిల్లలు ఎడమ చేతికి కట్టుకోవాలని సూచిస్తారు. ఈ విధానం శరీర శక్తుల సమతుల్యతకు సంబంధించినదని పండితులు వివరిస్తారు.

దారాన్ని కట్టే రోజు కూడా చాలా ముఖ్యమైనదని చెబుతారు. శనివారం లేదా అమావాస్య రోజున దారం కడితే ఫలితం మరింతగా ఉంటుందని నమ్మకం. శనివారం రోజు శనిదేవుడికి ఇష్టమైనదిగా చెబుతారు. అందుకు ఆయనకు నల్ల రంగు ప్రీతికరమని పండితులు చెబుతారు. ఆ రోజు నల్లదారం కట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని, చెడు గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వసిస్తారు.

Also Read:  https://teluguprabha.net/devotional-news/diwali-2025-things-to-buy-for-goddess-lakshmi-blessings/

అదే విధంగా అమావాస్య రోజున తామసిక శక్తులు ఎక్కువగా చురుకుగా ఉంటాయని పురాణాలు పేర్కొంటాయి. ఆ రోజున నల్లదారం ధరించడం ద్వారా ఆ శక్తులు మన శరీరానికి దరిచేరవని నమ్మకం. దీనివల్ల దృష్టిదోషం, నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు.

నల్లదారం ఎన్ని సార్లు చుట్టుకోవాలో కూడా ప్రత్యేకంగా చెబుతుంటారు. సాధారణంగా బేసి సంఖ్యలు శుభప్రదమని భావిస్తారు. అందువల్ల మూడు, ఏడు లేదా తొమ్మిది రౌండ్లు చుట్టుకుంటే శుభప్రదమని చెబుతారు. ఇది శక్తి చక్రాలను సమతుల్యం చేస్తుందని భావన.

పాజిటివ్ ఎనర్జీని..

దారం కట్టే ముందు కూడా కొన్ని ఆచారాలు పాటించాలి. ముందుగా స్నానం చేయడం ద్వారా శరీర శుద్ధి కలిగించుకోవాలి. తరువాత ఇంట్లో దీపం లేదా అగరబత్తీ వెలిగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. దారం కట్టే సమయంలో “ఓం నమః శివాయ” లేదా ఇష్టదైవం పేరును జపించడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, దైవభక్తిని పెంపొందిస్తుంది.

అలాగే నల్లదారం కేవలం ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు, శాస్త్రీయ దృక్కోణంలో కూడా ఇది కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. నల్ల రంగు శరీరంలోని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని సంతులనం చేయడంలో సహాయపడుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. ఇది నాడీ వ్యవస్థను శాంతింపజేస్తూ, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుందని కూడా చెప్పబడింది.

మరొకవైపు, పాతకాలంలో నల్ల దారాన్ని సహజమైన పత్తి లేదా నూలుతో తయారు చేసేవారు. అందులో సుగంధ ద్రవ్యాలు లేదా పవిత్రమైన హర్బ్స్ చేర్చేవారు. దీని వలన అది ఆరోగ్యపరమైన రక్షణని కూడా అందించేది. ఈ విధంగా నల్లదారానికి ఉన్న ప్రాముఖ్యత మతపరమైనదే కాక, శాస్త్రీయమైనదిగా కూడా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad