Lord Shiva Blessings On Zodiac Telugu: శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ పవిత్రకరమైన మాసం వచ్చే నెల 11న ప్రారంభమై..ఆగస్టు 09న ముగుస్తుంది. ఈ శుభప్రదమైన నెలలో హిందువులు పార్వతీపరమేశ్వరులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసం చేస్తూ శివారాధన చేస్తారు. ఈ సమయంలో కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ జూలై నెలలోనే కొన్ని గ్రహాల గమనంలో కూడా పెను మార్పులు సంభవించబోతున్నాయి. దీని కారణంగా 4 రాశులవారికి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశుల్లో మీది ఉందేమో చూసుకోండి.
వృషభం
శివుడికి ఇష్టమైన రాశుల్లో వృషభం కూడా ఒకటి. శ్రావణ మాసంలో వీరి దశ మారిపోనుంది. అన్నీ పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. లీలాధురుడి అనుగ్రహం వల్ల వృషభరాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో లాభపడతారు. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. ఆర్థిక స్థితిగతులు మారుతాయి. మునుపటి కంటే మంచి స్థితిలో ఉంటారు. అప్పుల భారం నుండి బయటపడతారు. మీకు అనేక విధాలను చేతికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. పెళ్లికానివారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.
కుంభరాశి
కుంభరాశి వారికి శ్రావణమాసం ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశి వారు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందనే శుభవార్త వింటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వైవాహిక జీవితంలోని గొడవలు తొలగిపోయి..అలుమెుగలు సంతోషంగా ఉంటారు. పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ధనప్రాప్తి ఉంటుంది. మానసిక సమస్యల నుండి బయటపడతారు. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ పోయి.. శివుడు కృపతో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇక నుండి వీరికి డబ్బు సమస్యలు ఉండవు.
మిథనరాశి
శ్రావణ మాసం మిథునరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. శివుడి అనుగ్రహం మీపై మెండుగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా అది విజయవంతంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలోని కలహాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, అపాయ్యతలు పెరుగుతాయి. ఆ మహాదేవుడి దయ వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. మహిళలకు సంతానభాగ్యం ఉంది.
కన్యారాశి
కన్యా రాశివారిపై శివుడు కృప ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రావణంలో కన్యారాశి వారు కోరుకున్న కోరికలన్నీ ఫలిస్తాయి. సంపద నాలుగు రెట్లు పెరుగుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. ఫారిన్ వెళ్లాలన్న మీ డ్రీమ్ నెరవేరుతుంది. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్స్ మీకు రెట్టింపు లాభాలను ఇస్తాయి. పేదరికం నుండి విముక్తి చెందుతారు. మీ ఇంట్లో పెళ్లికాని వారికి దగ్గర సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీరు ఏ పని చేసినా లక్ మీ వెంటే ఉంటుంది.