మల్లన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వీధులు విద్యుత్ దీప కాంతుల్లో వెలుగొందుతున్నాయి. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో శ్రీశైలంలోని వీధులను చూడముచ్చటగా దేవస్థానం అధికారులు తీర్చిదిద్దారు.
- Advertisement -
శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన డెకరేషన్ లైట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలతో శ్రీశైలం కొత్త శోభను సంతరించుకుంది.