Friday, April 18, 2025
HomeదైవంSrikalahasthi: నువ్వన్నా చెప్పవా శివయ్యా: గోమాత ఆక్రందన

Srikalahasthi: నువ్వన్నా చెప్పవా శివయ్యా: గోమాత ఆక్రందన

శివశివా

ఇది దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఎప్పుడు శివనామస్మరణతో ఆ పరమేశ్వరుని జపిస్తూ భక్తులు శ్రీ జ్ఞాన ప్రసన్నంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని తరిస్తుంటారు.

- Advertisement -

అయితే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నాలుగవ ప్రవేశ ద్వారం దక్షిణ గాలిగోపురం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన గోమాత దర్శన, పూజ, ప్రదక్షణ గోమాతను హారతులు, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి గోమాత ముందు నుంచి వెనక నుంచి తాకి కళ్ళకు అడ్డుకొని పుణ్యకార్యంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఇది హైందవ సాంప్రదాయంగా భావిస్తారు. ఇది ఇక్కడ ఆనవాయితీ. ఇది భక్తులకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గోమాత పూజగా భావిస్తారు.

అయితే దేవస్థాన ఆధ్వర్యంలో ఇక్కడ గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా భక్తులు అందించే పుణ్యకార్యం కూడా ఏర్పాటు చేసినందుకు ఆలయ అధికారులకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉంటారు.

ఈ పచ్చి గడ్డి గోమాతకు ఆహారంగా అందించే కార్యక్రమంలో ఒక రోజు వచ్చి గడ్డి మరొక రోజు పచ్చి గడ్డి మొదళ్లను ( శోగలను )ఆహారంగా అందించేందుకు అందుబాటులో ఉంచుతారు. కోకో మరో ఆశోకలను యంత్రాల ద్వారా తుక్కుతుక్కుగా తయారు చేసి గోమాత ఆహారంగా అందించేందుకు అక్కడ ఉంచడం పచ్చి గడ్డికి అలవాటు పడిన గోమాత సోగల యంత్రాలతో తుక్కు తుక్కుగా చేసి పిప్పి తినిపించడం వల్ల గోమాత ఆరోగ్యం ఏమౌతుందో అన్న కనీస జ్ఞానం లేని ఆలయ అధికారులు నిర్వాహకులు.


శ్రీకాళహస్తీశ్వరాలయ వ్యవసాయ భూములు వందల ఎకరాలు ఉన్న వాటిలో పండించిన పచ్చి గడ్డికి గోమాతలకు ఆహారంగా వేయాలని గోమాత సంరక్షణ బాధ్యతగా నిర్వహించాల్సిన ఆలయ అధికారులపై ఎంతైనా ఉంది. దేవస్థాన గోశాలలో సమృద్ధిగా గోమాతల సంరక్షణ పర్యవేక్షణ ఆరోగ్య విషయంలో వసతి విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సంరక్షణ బాధ్యతలు ఆలయ అధికారుల పైనే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News