దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన, దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆరుద్ర నక్షత్ర తిథి పురస్కరించుకుని నటరాజస్వామికి విశేషంగా అభిషేకం నిర్వహించారు.
భోగి-సోమవారం-ఆరుద్ర నక్షత్రం-పౌర్ణమి
ఈరోజు భోగి పండగ, పౌర్ణమి సోమవారం కావడంతో ఈ దినానికి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉందని అటువంటి రోజు ఆరుద్ర నక్షత్ర విశిష్టతను పురస్కరించుకొని ఆలయంలో నటరాజ స్వామికి అభిషేకం విశేషంగా నిర్వహించారు.
ఆరుద్ర నక్షత్ర పురస్కరించుకుని సోమవారం నటరాజస్వామికి శివకామ సుందరి మాణిక్య వాసులకు విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విశేష అభిషేక తిలకించారు. ఇంత విశేషమైన రోజు రావడం అరుదు అంటూ ఈ విశేష దినంనాడు అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు.