Saturday, November 23, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలంలో శ్రీరామనవమి వేడుకలు

Srisailam: శ్రీశైలంలో శ్రీరామనవమి వేడుకలు

శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహించబడింది. శ్రీశైల దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన ప్రసన్నాంజనేయ స్వామి వారి గుడిలో ఈ రోజు ఉదయం నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి తొమ్మిది గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించబడింది. ఈ కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పటించబడింది అలాగే కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించబడింది. అనంతరం వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, ఆ తర్వాత కంకణ పూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీ సీతా దేవి వారికి మాంగల్య ధారణ , తలంబ్రాలు, మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణ మహోత్సవం జరిపించబడింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని పలువురు దేవస్థానం సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించి సీతారామచంద్ర స్వామివార్లను మనస్ఫూర్తిగా స్మరించుకొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News