Friday, November 22, 2024
HomeదైవంSrisailam: క్యూలైన్లలోని భక్తులకు కంటిన్యూగా ఆహారం, నీళ్లు అందివ్వాలి

Srisailam: క్యూలైన్లలోని భక్తులకు కంటిన్యూగా ఆహారం, నీళ్లు అందివ్వాలి

భక్తులకు అందుతున్న సేవలపై రివ్యూ

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై (04.10.2023) కార్యనిర్వాహణాధికారివారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్నివిభాగాల యూనిట్అధికారులు, పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ భక్తుల రద్దీకనుగుణంగా
ఎప్పటికప్పుడు ఆయా సౌకర్యాల పట్ల అన్నివిభాగాల వారు ఆయా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తుల సౌకార్యార్థం మరిన్నీ డార్మిటరీలు, శౌచాలయాలు నిర్మించేందుకు అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అదేవిధంగా వారాంతపు రోజులలో సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయం, ఆర్జితసేవలు, అన్నప్రసాద వితరణ మొదలైనచోట్ల సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలన్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా క్యూకాంప్లెక్స్ లోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం
అందజేస్తుండాలన్నారు.

- Advertisement -


పార్కింగు సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా స్థానిక పోలీస్ శాఖ అధికారులతో తగు సమన్వయం చేసుకోవాలని భద్రతా పర్యవేక్షకుడిని ఆదేశించారు. దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ విరాళ పథకాలకు మరింతగా దాతల సహకారాన్ని పొందేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News