Friday, September 20, 2024
HomeదైవంSrisailam: అన్ని అర్జిత సేవలు, స్పర్శ దర్శనం ఆన్లైన్లోనే

Srisailam: అన్ని అర్జిత సేవలు, స్పర్శ దర్శనం ఆన్లైన్లోనే

శ్రీశైల దేవస్థానం వచ్చే నెల నుండి ఆన్లైన్ టికెట్లకు ప్రాధాన్యతనిస్తూ ఈరోజు నుంచి భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ www.srisailam.org. లో టికెట్లను శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న స్విచ్ ఆన్ చేసి టికెట్లను అందుబాటులో ఉంచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులు ఇక్కడికి వచ్చినవారు టికెట్ల కోసం లైన్లో నిలబడి ఇబ్బంది పడుతున్నామన్న కంప్లైంట్ మేరకు ఈ టికెట్లను ఆన్లైన్లో ప్రక్రియ చేపట్టామన్నారు. ప్రతి ఒక్క అర్జిత సేవ టికెట్లను భక్తులు డైరెక్ట్గా ఆన్లైన్లో పొంది శ్రీశైలం రావాలని తెలియజేశారు. ఆన్లైన్లో టికెట్ పొందిన భక్తుడు టికెట్ హార్డ్ కాపీని ఒరిజినల్ ఆధార్ కార్డు కాపీని తప్పనిసరిగా తెచ్చుకోవాలని అలాగే బుక్ చేసుకున్న టైమింగ్ స్లాట్స్ ప్రకారమే దర్శనానికి సేవలకు అనుమతి ఇస్తామన్నారు. ఆన్లైన్ టికెట్ పొందిన భక్తుడు టికెట్ మీద పొందుపరిచిన టైం కంటే 15 నిమిషాల ముందు దేవస్థానం డొనేషన్ కౌంటర్ వద్ద రిపోర్ట్ చేసుకొని అనంతరం టికెట్ స్కాన్ చేసుకొని శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి వెళ్ళవలసినదిగా తెలియజేశారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం పారదర్శకంగా కలిగించుట కొరకు భక్తుల సౌలభ్యం కొరకే దీని ద్వారా భక్తులు తమ అనుకూలతను బట్టి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం సౌలభ్యంగా చేసుకుంటారు అని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News