Saturday, November 23, 2024
HomeదైవంSrisailam: అర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు అన్నీ ఇక ఆన్లైన్ లోనే

Srisailam: అర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు అన్నీ ఇక ఆన్లైన్ లోనే

 శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో జరిగే అన్ని అర్జితసేవ టికెట్లు, స్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు ఇక నుంచి ఆన్లైన్లోనే మాత్రమే లభ్యం కానున్నాయి.  దీంతో అప్పటికప్పుడు శ్రీశైలం వచ్చి కరెంట్ బుకింగ్ లు చేసుకునే సౌలభ్యం ఉండదని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుండి శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచి మే 31 నుంచి భక్తులకు టికెట్లు జారి చేయనుంది దేవస్థానం. పర్వదినాలు సెలవు దినాలలో కాకుండా సాధారణ రోజులలో కూడా శ్రీశైలం భక్తులు అధికంగా వస్తుండడంతో సామాన్య భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనము సౌకర్యవంతంగా కల్పించేందుకు అర్జితసేవ టికెట్లు, స్పర్శ దర్శనం టికెట్ల జారీ విషయంలో మార్పులు చేపట్టినట్టు ఈవో. ఎస్. లవన్న తెలిపారు.

- Advertisement -

సామాన్య భక్తుల దర్శనాలు, స్పర్శ దర్శన భక్తులకు ఇబ్బందులు కలగకుండా విడతలవారీగా అన్ని అర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో అర్జిత సేవా టికెట్లు స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు టికెట్ పై సూచించిన సమయంలో మాత్రమే సేవ మరియు దర్శనం అవకాశం కల్పించబడిందని, టికెట్లు పొందిన వారు 15 నిమిషాల ముందు ప్రవేశద్వారం ముందు రిపోర్ట్ చేయాలన్నారు. అలాగే ఆన్లైన్ టికెట్ పొందిన ప్రింట్ తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి అని టికెట్టు స్కానింగ్ జరిపిన తర్వాతనే ఆలయ లోనికి అనుమతి ఇస్తామని తెలియజేశారు. కాగా భక్తులు ఈ విషయాలు గమనించుకొని దేవస్థానానికి సహకరించాల్సినదిగా తెలియజేశారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News