Saturday, November 23, 2024
HomeదైవంSrisailam: బయలు వీరభద్ర స్వామి అభిషేకం

Srisailam: బయలు వీరభద్ర స్వామి అభిషేకం

శ్రీశైలంలో లోకకళ్యాణం కోసం దేవస్థానం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి విశేష పూజలు నిర్వహించింది. ప్రతి మంగళవారం, అమావాస్య రోజులలో సాయంకాలం ఈ విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించబడతాయి. ఈ అభిషేకంలో కార్యక్రమం పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, బస్మోదకం, గందోదకం, పుష్పోదకం ,శుద్ధ జలాలతో నిర్వహించడం జరుగుతుంది బయలు వీరభద్ర స్వామి వారు శివ భక్తగణాలకు అధిపతి. శ్రీశైల క్షేత్ర పాలకుడిగా క్షేత్రం ప్రారంభంలో ఆరు బయట ఉండి ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండా బయలుగా దర్శనం ఇస్తాడు కనుక ఆయనకు బయలు వీరభద్ర స్వామి అని పేరు. ప్రసన్న వదనంతో కిరీట ముకుటాన్ని కలిగి దశబుజుడై 10 చేతులతో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామి వారికి క్రింది వైపులో కుడి వైపున దక్షుడు, ఎడమ వైపున భద్రకాళి దర్శనమిస్తారు. ఈ

- Advertisement -

స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్టమైన సమస్యలు తొలగిపోతాయని వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. ఆగమ సాంప్రదాయంలో క్షేత్రపాలకు పూజకు చాలా విశిష్టత ఉంది. క్షేత్రపాలకుడి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఇటువంటి భయబాధాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం అమావాస్య రోజులలో చేసే వీరభద్ర పూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ స్వామి పూజతో సకల గ్రహఅరిష్ట దోషాలు, దృష్ట గ్రహ పీడలు తొలగిపోతాయ. సంతానం ఐశ్వర్యం మొదలైన అనేక ఫలితాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News