ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంలో కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించమని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.
గురువారం నుంచి మొదలైన పది రోజులపాటు జరిగే దసరా మహోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీభ్రమరాంబికా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ వాహనసేవలతో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.