మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు గజవాహనసేవ జరిపించారు. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేయించి, ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
- Advertisement -
ఈ కార్యక్రమములో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డొల్ థాషా, మహిళా వీరగాసి కన్నడ జానపద కళా ప్రదర్శన, పురుషులు వీరగాసి కన్నడ కళా ప్రదర్శన, కాళికా నృత్యం, జాంజ్పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, డమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశారు.