Saturday, November 23, 2024
HomeదైవంSrisailam Hundi @ 4 crs in 28 days: శ్రీశైల హుండీ ఆదాయం...

Srisailam Hundi @ 4 crs in 28 days: శ్రీశైల హుండీ ఆదాయం 4 కోట్లు

శ్రీశైలంలో ఈరోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి 3, 98, 34,583/-2 నగదు రాబడి లభించింది. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (06.06.2024 నుండి 03.07.2024 వరకు) సమర్పించినదే.

- Advertisement -

అలాగే ఈ హుండీలో 148 గ్రాముల బంగారం, 6 కేజీల 260 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 835 – యుఎస్ఏ డాలర్లు, 30- యూరోలు, 2- ఓమన్ రియాల్స్, 2- కత్తార్ రియాల్స్, 105 – కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 55 – యూ.ఏ.ఈ దిర్హమ్సు, 20 – సౌదీఅరేబియా రియాల్స్, 106- మలేషియా రింగిట్స్ 80 – థాయిలాండ్ బాట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి శ్రీ డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News