Thursday, September 19, 2024
HomeదైవంSrisailam Maha Kumbhabhishekam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

Srisailam Maha Kumbhabhishekam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

వైభవంగా..

మహాకుంభాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా సాగుతోంది. కాగా ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ రోజుతో ముగిసింది. ఈ రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఉపముఖ్యమంత్రి-దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచాబ్రహ్మానందారెడ్డి, శ్రీశైల నియోజవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్, రాష్ట్ర దేవదాయశాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ కూడా ఈ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్య స్వామి, జంగం సుజాతమ్మ, జి. నరసింహారెడ్డి, ఎం. విజయలక్ష్మీ, బి. రాజేశ్వరి, ఎ. లక్ష్మీసావిత్రమ్మ, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు.

- Advertisement -


కాగా ప్రధానాలయంలో శివాజీ గోపుర పునర్నిర్మాణం, ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ, పంచ మఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ మరియు ఆయా ఉపాలయాలో, మఠాలలో శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ సందర్భంగా ఈ మహాకుంభాభిషేకం జరిపించబడింది. ప్రధానాలయంలోని శ్రీస్వామి వారి గర్భాలయ విమానం, అమ్మవారి గర్భాలయ విమానం, నాలుగు దిక్కులు గల నాలుగు ప్రధానగోపురాలు, అమ్మవారి ద్వారగోపురం మరియు ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలు, పరివార ఆలయాలలో ఈ కుంభాభిషేకం జరిపించబడింది.
అదేవిధంగా క్షేత్రంలోని గంగాధరమండపం, ఆరామవీరేశ్వరాలయం, అంకాళమ్మ ఆలయం, నందిగుడి, బయలువీరభద్రస్వామిఆలయం, పాతాళగంగమార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం, పాతాళేశ్వర ఆలయం, గంగాసదన్ వద్ద గల గణపతి ఆలయం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం మరియు పంచమఠాలలో ఈ మహాకుంభాభిషేకం జరిపించబడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News