Friday, November 22, 2024
HomeదైవంSrisailam: మహాగోల స్వరూపంలో అలంకారం

Srisailam: మహాగోల స్వరూపంలో అలంకారం

సకల పాప హారిణి ఈ అమ్మ

నవదుర్గ అలంకారాలలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని మహాగోల స్వరూపంలో అలంకరింపజేశారు. నవదుర్గ స్వరూపాలలో ఎనిమిదవ రూపం ఈ మహాగోల
ఎనిమిదవ రోజున ఈ స్వరూపాన్ని పూజిస్తారు. నవదుర్గలలో మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తిగా చెప్పబడుతోంది. ఈ దేవి తెల్లని వస్త్రాలను ధరించి, చతుర్భుజాలను కలిగి ఉంటుంది. కుడివైపు ప్రభుజంలో మాటాలాన్ని క్రింది భుజంలో వైపు పై భుజంలో వరముద్రను, క్రింది భుజంలో ధనురుకాన్ని కలిగి ఉంటుంది.

- Advertisement -

మహాగౌరి తన రూపంలో పరమశివుని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేయసాగింది. ఈ తపస్సు కారణంగా ఈమె శరీరమంతా నల్లబడింది. ఆ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు శరీరంపై గంగాంబాన్ని చిలకరించాడు. అప్పుడు దేవి తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారింది. అందుకే ఈ దేవి మహాగౌరిగా పిలువబడింది. దసరా మహోత్సవారి ఎనిమిదవ రోజుని ఈ దేవిని పూజిస్తారు. ఈ దేవిని పూజించడం వలన సకల పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News