శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా, ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 3 లక్షల 29 వేల 226 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 27 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు.
ఈ హుండి లెక్కింపులో నగదుతో 521 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 6 కేజీల 130 గ్రాముల వెండి లభించాయి పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో యుఎస్ఏ డాలర్లు 3740, కువైట్ దినార్లు 10, సింగపూర్ డాలర్లు 30, యు, ఏ, దిర్హమ్స్ 15, ఆస్ట్రేలియా డాలర్లు 70, మలేషియా రిగేట్స్ 15, యూరోలు 60,మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.