Friday, September 20, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలం మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

Srisailam: శ్రీశైలం మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో అర్చకులు,వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలో ఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు శ్రీ స్వామివారి గర్భాలయం ద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్మించారు పాతాళగంగ నుంచి తెచ్చిన పుణ్య జలాలతో శ్రీమల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీస్వామివారు జలంలోనే ఉండిపోతారు. రాష్ట్రంలో వర్షాలు సంవృద్దిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని దేశంలోని ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే సంకల్పంతో శ్రీశైలం ఆలయంలో శ్రీమల్లికార్జునస్వామి వారికి శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు.

- Advertisement -

ముందుగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కమీషనర్, చైర్మన్, ఈఓ లవన్న పాతాళగంగ నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చారు. అనంతరం శ్రీస్వామివారి ఘటాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులను దేవాలయంలోనికి అనుమతించగా భక్తులు పవిత్ర జలాలతో వెళ్లి శ్రీస్వామివారి గర్భాలయంలో జలంతో స్వామివారిపై పోసి దర్శించుకుంటున్నారు. ఈరోజు అంతా శ్రీ స్వామి వారు జలాలతోనే భక్తులకు దర్శనమిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News