మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల వారు శ్రీశైలంలోని స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ దేవస్థానం తరుపున ఉప కార్యనిర్వహణాధికారి బాబురావు, ఉపప్రధానార్చకులు కొండూరి జనార్థనాచార్యులు, పెద్దంటి ఫణికుమార్, సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, వేదపండితులు మహేష్ కుమార్ శర్మ, సోమశేఖరశర్మ, రవికుమార్ శర్మ, వెంకటేశ్వర శర్మ ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ద్వారకా తిరుమల దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు అనసూయ, సుబ్బరావు, పద్మజ్యోతి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు కూడా ఈ పట్టువస్త్రాల సమర్పణలో పాల్గొన్నారు. ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు, అర్చకస్వాములకు స్వాగతం పలికారు. తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.