Saturday, October 5, 2024
HomeదైవంSrisailam: మల్లన్న స్పర్శ దర్శనాలు రద్దు, ఉగాది మహోత్సవాల వివరాలు ఇవే

Srisailam: మల్లన్న స్పర్శ దర్శనాలు రద్దు, ఉగాది మహోత్సవాల వివరాలు ఇవే

శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు 19.03.2023 నుండి 23.03.2023 వరకు అయిదు రోజులపాటునిర్వహింస్తారు. ముఖ్యంగా ఈ ఉత్సవాలలో కర్ణాటక పలు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. పాదయాత్ర ద్వారా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేయడం విశేషం. ఇప్పటికే భక్తులు అధికసంఖ్యలో క్షేత్రాన్ని చేరుకున్నారు.

- Advertisement -


భక్తులు సేదతీరేందుకు చలువ పందిర్లు
ఉత్సవాలలో వచ్చే భక్తాదులు సేదతీరేందుకు పలుచోట్ల చలువపందిర్లు చేయబడ్డాయి. శివదీక్షా శిబిరాలు, సిబ్బంది వసతి గృహాల వద్ద గల బాలగణేశవనం, ఆలయ దక్షిణభాగంలో గల రుద్రాక్షవనం, ఆలయ మాడవీధులు, మల్లమ్మకన్నీరు, పలు ఆరుబయలు ప్రదేశాలు మొదలైనచోట్ల చలువ పందిళ్ళువేశారు. అదేవిధంగా కాలిబాటమార్గములోని నాగలూటి, పెద్దచెరువు కైలాస ద్వారం, హటకేశ్వరం వరకు గల కాలిబాటలో పలుచోట్ల మొదలైన చోట్ల కూడా చలువ పందిర్లు ఆలయ అధికారులు వేశారు.

విద్యుద్దీకరణ ఏర్పాట్లు
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని పలు చలువపందిర్ల వద్ద ఆరుబయలు ప్రదేశాలలో తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. అలాగే కాలిబాటలోని నాగలూటి, పెద్దచెరువు, కైలాసద్వారం మొదలైన చోట్ల కూడా జనరేటర్ల ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణను ఏర్పాటయ్యాయి.
సుమారు 500 పైగా మంచినీటి కుళాయిలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.


దర్శన ఏర్పాట్లు
భక్తులను మూడు క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం, శ్రీ శ్రీఘ్రదర్శనం (రూ.200/-లు) అతి శీఘ్రదర్శనం (రూ.500/-) ద్వారా దర్శనానికి ప్రవేశం కల్పించారు. ఉత్సవాలలో భక్తులందరికీ శ్రీ స్వామివారిర అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. భక్తుల రద్దీ కారణంగా ఉత్సవాలలో శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడింది.

అన్నప్రసాద వితరణ
దేవస్థానం అన్నదాన భవనం నందు భక్తులకు అన్నదానం కల్పిస్తున్నారు. నాగలూటి, కైలాస ద్వారం, క్షేత్ర పరిధిలోని పలుచోట్ల కన్నడ భక్త బృందాల వారు అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేసే సేవా సంస్థలన్నింటికి కూడా దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది.

వైద్య సదుపాయాలు

జిల్లా వైద్యశాఖ సహకారముతో భక్తులకు వైద్యసేవలు కల్పిస్తున్నారు. దేవస్థానం వైద్యశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు కైలాస ద్వారం, హటకేశ్వరం, క్యూకాంప్లెక్స్, ఆలయ మహాద్వారం మొదలైన పలు చోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేశారు.

వాహనాల పార్కింగ్
ఆర్.టి.సి. బస్టాండ్ వెనుక భాగం, యజ్ఞ వాటిక, వలయ రహదారి మొదలైన చోట్ల వాహనాల పాంగ్ ఏర్పాచేశారు. ప్రైవేటు బస్సులకు గ్యాస్ గోడౌన్ వద్ద పార్కింగ్ ఏర్పాటయింది. కారు, జీపు మొదలైన వాటికి గణేశ సదనం ఎదురుగాను, హెలిప్యాడ్ వద్ద దేవస్థానం, ఆగమ పాఠశాల ఎదుటి ప్రదేశం, ఘంటామఠం సమీపం మొదలైన చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
సుమారు 560 మరుగుదొడ్లను భక్తుల కోసం క్షేత్ర పరిధిలో ఏర్పాటు చేశారు. భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల తెలుగు, కన్నడ భాషల్లో బోర్డులను ఏర్పాటు చేశారు.

పుష్పాలంకరణ
ఉత్సవాలలో శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేస్తారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా అలంకరిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు ఆలయపుష్కరిణి వద్దగల భ్రామరీకళావేదిక వద్ద,శివ దీక్షా శిబిరాల వద్ద పలు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత ప్లే బ్యాక్ గాయకుల చేత కన్నడ భక్తి సంగీత విభావరి, కన్నడ భక్తి రంజని, ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా శ్రీ స్వామిఅమ్మవార్ల కైంకర్యంలో భాగంగా గ్రామోత్సవంలో కోలాటం, చెక్క భజన, పగటివేషాలు, బుట్టబొమ్మలు, గౌరవనృత్యం, కన్నడ ప్రాంత డోలు వాయిద్యాలు మొదలైన జానపద కళారూపాలు ఏర్పాటు చేశారు.

తెలుగు, కన్నడ భాషల్లో ఏర్పాటు చేసిన తోరణాలు
శ్రీశైలంలో భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు ఇవే
శ్రీశైలంలో భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News