Friday, April 4, 2025
HomeదైవంSrisailam: శ్రీశైలంలో పుష్కరిణి హారతి

Srisailam: శ్రీశైలంలో పుష్కరిణి హారతి

దశవిధ హారతులు..

శ్రీశైలంలో పుష్కరిణి హారతులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం (12.12.2023) గం. 6.30ల నుండి శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా ఇవ్వనున్నారు.

- Advertisement -

కాగా ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేయించి విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను ఇస్తారు.

ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూర హారతి సమర్పిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News