Friday, September 20, 2024
HomeదైవంSrisailam: SBMS మార్కెట్ అసోసియేషన్ తరపున పట్టు వస్త్రాలు సమర్పణ

Srisailam: SBMS మార్కెట్ అసోసియేషన్ తరపున పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీశైలం మహా క్షేత్రంలో ఏప్రిల్ 11 వ తారీఖున అమ్మవారికి కుంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా SBMS మార్కెట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా భ్రమరాంబ దేవికి దేవస్థానంతో పాటు అసోసియేషన్ తరపున కుంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ భ్రమరాంబ దేవికి మల్లికార్జున స్వామి కి పట్టు వస్త్రాలు సమర్పించి అలాగే పరివార దేవాలయాల అమ్మవార్లకు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామ దేవత అంకాలమ్మకు పూజ చేసి, పట్టు వస్త్రాలు తీసుకొని మేళతాళాలతో వేడుకగా వెళ్లి శ్రీ భ్రమరాంబ దేవికి, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ తో పాటు కమిటీ సభ్యులు కుంభోత్సవ కమిటీ సభ్యులు, కుంభోత్సవ సిద్ధాంతి స్థానికులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News