Saturday, October 5, 2024
HomeదైవంSrisailam: విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు

Srisailam: విజయవాడ దుర్గమ్మ గుడి నుంచి మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు

ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ కె. రాంబాబు, కార్యనిర్వహణాధికారి శ్రీ కె. ఎస్. రామరావు, అర్చకులు, వేదపండితులు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు సిబ్బంది ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చక స్వాములు, వేదపండితులు, ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరుపాక్షయ్యస్వామి, ఎం. విజయలక్ష్మి, ఓ. మధుసూదన్ రెడ్డి దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

- Advertisement -


తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పఠించారు. అనంతరం నూతన వస్త్రాలకు పూజాదికాలు జరిపించారు. ఆ తరువాత మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ఫలపుష్పాలు, అమ్మవారికి పసుపు, కుంకుమలు గాజులు, సమర్పించారు.
ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరుపున ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పిస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News