Sun Mars conjunction in Libra: ఈ ఏడాది ధనత్రయోదశి పండుగ అక్టోబర్ 18న, వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పండుగకు ముందు రోజు, అంటే అక్టోబర్ 17న, గ్రహాల ప్రభావంలో ముఖ్యమైన మార్పు చోటుచేసుకోబోతుంది. ఆ రోజున సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం సమయంలో కుజుడు కూడా తులా రాశిలో ఉన్నందున, సూర్యుడు–కుజుడు యోగం ఏర్పడబోతున్నట్లు పండితులు వివరిస్తున్నారు.
ఈ యోగం గ్రహస్థితులను ప్రభావితం చేస్తూ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా శుభ ఫలితాలు అందించబోతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం, ఈ కలయిక వృషభం, సింహం, తులా, కుంభ రాశులకు సానుకూల పరిస్థితులను సృష్టిస్తుంది.
సూర్యుడు నాయకత్వం, శక్తి, విజయానికి ప్రతీకగా పరిగణిస్తారు. కుజుడు ధైర్యం, పోరాటస్ఫూర్తి, ఆర్థిక స్థిరత్వానికి కారకుడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు వ్యక్తుల జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని, పురోగతిని తీసుకువస్తాయని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ధనత్రయోదశి సమయానికి ఈ కలయిక జరగడం శుభప్రదంగా భావిస్తున్నారు.
వృషభ రాశి
సూర్యుడు–కుజుడు కలయిక వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నవారికి ఇది అనుకూల సమయం. బంగారం, వెండి లేదా ఇల్లు వంటి ఆస్తుల కొనుగోలుకు కూడా ఈ సమయం మంచిదిగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
చాలా కాలంగా బాధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పనిలో నిబద్ధత పెరగడంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. కుటుంబసభ్యుల మధ్య సౌహార్ద వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాల లాభం పొందవచ్చు.
సింహ రాశి వారికి అదృష్ట కాలం
అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించి కుజుడుతో కలిసే సమయంలో సింహ రాశి వారికి అదృష్టం మరింతగా చేరువవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు లేదా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందుతారు. అడ్డంకులు తొలగిపోవడంతో కెరీర్‌లో పురోగతి సాధ్యమవుతుంది.
లక‍్ష్మీదేవి, కుబేరుని కృప ఈ సమయంలో ప్రత్యేకంగా ఉండే అవకాశాలున్నట్లు పండితులు వివరిస్తున్నారు. శత్రువులపై విజయాన్ని సాధించడమే కాకుండా, మీ ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలం అనుకూలంగా ఉండబోతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది.
తులా రాశి
ఈసారి సూర్యుడు–కుజుడు కలయిక తులా రాశిలోనే ఏర్పడుతున్నందున, ఈ రాశి వారికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోనున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో ఆనందకరమైన సంఘటనలు జరిగే సూచనలున్నాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి.
ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులకు ఇది శుభ సమయంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, శక్తి ఉత్సాహం పెరుగుతుంది.
కుంభ రాశి
సూర్యుడు–కుజుడు యోగం కుంభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, వ్యాపార లాభాలు గణనీయంగా పెరగవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంది. వివాహం కాని వారికి అనుకూలమైన ప్రతిపాదనలు రావచ్చు. కుటుంబం నుంచి మద్దతు లభించి, దీర్ఘకాల లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయవచ్చు.
ఆరోగ్య పరంగా మెరుగుదల కనిపిస్తుంది. వైద్య ఖర్చులు తగ్గి ఆర్థిక భారం తక్కువవుతుంది. మానసికంగా కూడా ఈ కాలం ప్రశాంతతను ఇస్తుంది. మీరు ప్రారంభించబోయే పనుల్లో విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి.
గ్రహాల కలయిక ప్రభావం
జ్యోతిష్యుల చెబుతున్న దాని ప్రకారం సూర్యుడు–కుజుడు కలయిక ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు వ్యక్తులలో శక్తి, ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరపడాలనుకునేవారికి ఈ కాలం మంచి అవకాశాలను అందిస్తుంది. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మాత్రం చేయవద్దు. సహనం, సమయపాలనతో వ్యవహరిస్తే ఈ యోగం ఎక్కువ మేలు చేస్తుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/seeing-black-cat-meaning-in-dreams-and-travel-brings-luck/
ధనత్రయోదశి ప్రత్యేకత
ధనత్రయోదశి రోజున సూర్యుడు, కుజుడు తులా రాశిలో ఉన్న ఈ సమయం ఆర్థికపరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా శుభప్రదంగా ఉంటుంది. సంపద దేవత లక‍్ష్మీదేవిని పూజించడం, బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం ఈ రోజు అదృష్టాన్ని పెంచుతుందని నమ్మకం. ఈసారి గ్రహ స్థితులు కూడా దానికి అనుకూలంగా ఉండటం ప్రత్యేకతగా మారింది.


