Sun Transit In August 2025: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల అధిపతిగా భావిస్తారు. గౌరవం, విజయాన్ని ఇచ్చే భాస్కరుడు ఆగస్టు 17న తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంతేకాకుండా ఇదే నెల 30న ఆదిత్యుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు సంచారాల కంటే ముందు ఆగస్టు 03న గ్రహాల రాజు ఆశ్లేష నక్షత్రం లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. సూర్యుడి యెుక్క ఈ సంచారాల వల్ల కొందరి అదృష్టం మారబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి
సూర్యుడు త్వరలో ఇదే రాశిలో సంచరించబోతున్నాడు. దీంతో ఆగస్టు నెలలో సింహరాశి వారి సుడి తిరగనుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. మీకు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు. మీరు ప్రతి పనిని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
వృషభరాశి
సూర్యుడి యెుక్క రాశి, నక్షత్ర మార్పులు వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. మీరు ఏ కార్యాన్ని చేపట్టినా దానిని విజయవంతం చేసి తీరుతారు. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అప్పుల భారం నుండి విముక్తి పొందుతారు.
Also Read: Hindu Mythology- పాముల్లో ఏది అత్యంత శక్తివంతమైనది.. శేష నాగ, వాసుకి, తక్షకుడా?
తులా రాశి
తులారాశి వారికి ఆదిత్యుడు సంచారం కలిసి వస్తుంది. వీరు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ ఫలిస్తుంది. వైవాహిక జీవితంలో అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తలు మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు విజయం సాధిస్తారు. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది.


