Thursday, January 22, 2026
HomeదైవంSun Transit: ధనుస్సు రాశిలోకి సూర్యుడు.. వీరి జీవితాల్లో వెలుగులు!

Sun Transit: ధనుస్సు రాశిలోకి సూర్యుడు.. వీరి జీవితాల్లో వెలుగులు!

Sun Transit in Sagittarius 2025: జ్యోతిష్యశాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల అధిపతిగా భావిస్తారు. సూర్యుడు నెలకొకసారి చొప్పున సంవత్సరం మెుత్తం మీద 12 రాశుల్లో సంచరిస్తాడు. భాస్కరుడు మరో మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 16న వృశ్చిక రాశిని విడిచిపెట్టి ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. ఇదే రాశిలో ఆదిత్యుడు జనవరి 14 వరకు ఉంటాడు. ధనుస్సు రాశిలో సూర్యుడు సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. కొత్త ఏడాదిలో లాభపడబోయే రాశులు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

ధనుస్సు రాశి
ఇదే రాశిలో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో విజయం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారస్తులు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి టైం. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందంతోపాటు అదృష్టం ఉంటుంది.

మేష రాశి
సూర్యుడు సంచారం మేష రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కెరీర్ లో ఊహించని రేంజ్ లో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయంలో ఆకస్మిక వృద్ధి ఉంటుంది. అప్పులన్నీ తీరిపోతాయి. మీ చింతలన్నీ తొలగిపోతాయి. భార్యభర్తల మధ్య అనురాగంతోపాటు అపాయ్యతలు పెరుగుతాయి. లవ్ లైఫ్ బాగుంటుంది.

Also Read: Dreams – పులి కలలో కనిపించడం.. శుభమా? అశుభమా?

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఆదిత్యుడు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులతోపాటు పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం అమాంతంగా పెరిగిపోతుంది. కెరీర్ లో గ్రోత్ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి.

Disclaimer: పైన ఇవ్వబడిన సమాచారం పూర్తిగా నిజమైనదని ఖచ్చితంగా చెప్పలేం. పండితుల సూచనలు, నిపుణుల అభిప్రాయాలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా రూపొందించడమైనది. దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News