Tuesday, December 9, 2025
HomeదైవంSun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు జాక్ పాట్ గురూ..

Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు జాక్ పాట్ గురూ..

Surya nakshatra Parivartan 2025: గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు మరో రెండు తన నక్షత్రాన్ని మార్చబోతున్నారు. నవంబర్ 19న భాస్కరుడు విశాఖ నక్షత్రాన్ని వదిలి అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్కడే డిసెంబర్ 02 వరకు సంచరిస్తాడు. సూర్యుడి యెుక్క ఈ నక్షత్ర సంచారం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు రాబోతున్నాయి. వీరికి డబ్బు లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఆదిత్యుడు సంచారం వల్ల లాభపడబోయే రాశులు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

తులా రాశి
తులా రాశి వారికి భాస్కరుడు నక్షత్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం ఓ రేంజ్ లో పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. మీరు కోరుకున్న విధంగానే మీ కెరీర్ ఉంటుంది. మీకు అనేక విధాలుగా డబ్బు వస్తుంది. సమాజంలో మీ గౌరవం ఒక్కసారిగా పెరిగిపోతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మికతపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.

మిథున రాశి
సూర్యుడు నక్షత్ర సంచారం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉండి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. మీ అదృష్టం తెరుచుకుంటుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికంగా ధనాన్ని ఆర్జిస్తారు.

Also Read: Rajyog-కొత్త ఏడాదిలో పవర్ పుల్ రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు ప్రారంభం..

మకర రాశి
ఆదిత్యుడు నక్షత్ర మార్పు మకరరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మీలో ధైర్యం, శౌర్యం రెండూ పెరుగుతాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి టైం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగుల బాధ్యతలు పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. అదృష్టం మీకు కలిసి రావచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News