Sun Nakshatra transit 2025: సూర్యభగవానుడిని గ్రహాలన్నింటికి రాజుగా భావిస్తారు. వాస్తవంగా సూర్యుడిని ఆత్మ, గౌరవం, తండ్రి, ఆరోగ్యం, ఉన్నత స్థానం, ప్రతిష్ట మరియు విజయాన్ని ఇచ్చేవాడిగా పరిగణిస్తారు. సూర్య కటాక్షం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. మీ పనికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదిత్యుడు తన స్థానాన్ని మార్చినప్పుడల్లా రాశిచక్ర గుర్తుల జీవితాల్లో మార్పు వస్తుంది. భాస్కరుడు సెప్టెంబరు 27, 2025న ఉదయం 7:14 గంటలకు హస్త నక్షత్రంలో సంచరించబోతున్నాడు. అతడు అక్టోబర్ 10న రాత్రి 8:19 గంటల వరకు అక్కడే ఉంటాడు. సూర్య సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
మీన రాశి
ఆదిత్యుడు సంచారం మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభాలను ఇవ్వబోతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. పెళ్లి కానీ యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువులపై శ్రద్ద పెడతారు. అంతేకాకుండా మంచి మార్కులు కూడా సాధిస్తారు. ఆధాత్మిక యాత్రను చేయడానికి ఇదే అనుకూల సమయం. పోగొట్టుకున్న వస్తువు మీ దరికి చేరుతుంది.
మేష రాశి
హస్త నక్షత్రంలో సూర్య సంచారం మేషరాశి వారి ఆనందాన్ని రెట్టింపు చేయనుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పెళ్లికాని వ్యక్తులకు వివాహం కుదురుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు జాబ్ దొరుకుతుంది.
Also Read: Mars Transit 2025- రాహువు నక్షత్రంలోకి కుజుడు.. ఈ 3 రాశులకు కుబేర యోగం..
తుల రాశి
భాస్కరుడు సంచారం తులరాశి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురాబోతుంది. ఆధ్యాత్మిక లేదా మతపరమైన యాత్ర చేసేవారికి తెలియని ఆనందం కలుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగుల ఒత్తిడి దూరమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు తీసుకునే రిస్క్ నిర్ణయాలు వల్ల మంచి ఫలితాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు మరింత లాభాలను గడిస్తారు.
Also Read: Budhaditya Yoga – సింహరాశిలో అరుదైన యోగం.. నక్క తోక తొక్కబోతున్న 5 రాశులు..
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


