Sun Transit in Scorpio 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అలాంటి సూర్యభగవానుడి రాశి మార్పు ప్రజలందరి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నెలకొకసారి రాశిచక్రాన్ని మార్చే భాస్కరుడు నవంబర్ 17న వృశ్చిక రాశి ప్రవేశం చేయనున్నాడు. సంవత్సరం తర్వాత ఈ రాశిలోకి వెళ్లబోతున్నాడు. ఆదిత్యుడు యెుక్క ఈ సంచారం వల్ల మూడు రాశులవారి అదృష్టం మారబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఇదే రాశిలోకి సూర్యుడు వెళ్లబోతున్నాడు. మీరు కెరీర్ లో మంచి సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ స్కిల్స్ పెరుగుతాయి. వ్యాపారాలు ఊహించని లాభాలను ఇస్తాయి. ఆర్థికంగా మిమ్మల్ని ఎవరూ టచ్ చేయని పొజిషన్ కు వెళ్తారు. అప్పుల భారం నుండి బయటపడతారు.
సింహ రాశి
సూర్యభగవానుడు సంచారం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ప్రేమలో విజయం సాధిస్తారు. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సపోర్టు లభిస్తుంది. కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళ్తారు.
Also Read: Parijata Plant – ఇంట్లో పారిజాత మొక్క ఉంటే మంచిదా? కాదా?
మకర రాశి
సూర్యుడి సంచారం వల్ల మకరరాశి వారి తలరాత మారబోతుంది. మీ ఆదాయం ఓ రేంజ్ లో పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, లాటరీల్లో పెట్టుబడులు పెట్టేవారు లాభపడతారు. సంసార జీవితం సాఫీగా ఉంటుంది.


