Sun transit in September 2025: గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు సెప్టెంబరులో రెండు సార్లు తన గమనాన్ని మార్చనున్నాడు. భాస్కరుడు యెుక్క డబుల్ సంచార ప్రభావం మెుత్తం 12 రాశులవారి పై పెను ప్రభావాన్ని చూపనుంది. ఈరోజు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించనున్న ఆదిత్యుడు.. సెప్టెంబరు 17న కన్యా రాశిలోకి వెళ్లబోతున్నాడు. సూర్యుడి యెుక్క ఈ సంచారం వల్ల నాలుగు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేష రాశి
సూర్యుడి డబుల్ సంచారం వల్ల మేషరాశి వారు ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. మీ కెరీర్ లో పురోగతితోపాటు డబ్బు కూడా ఉంటుంది. వివాహప్రాప్రికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలను తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. లక్ కలిసిరావడంతో మీరు ప్రతి పనిని సక్సెస్ పుల్ చేస్తారు. అప్పుల ఊబి నుండి బయటపడతారు.
కర్కాటక రాశి
సూర్యుడి సంచారం కర్కాటక రాశి వారి తలరాతను మార్చబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. ప్రేమికులు మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
సింహరాశి
సింహరాశి వారికి భాస్కరుడు సంచారం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీకు అన్నింటా విజయం లభిస్తుంది. సంసార జీవితం బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. భారీగా డబ్బు సంపాదిస్తారు. రుణ విముక్తి నుండి బయటపడతారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది.
Also Read: Diwali 2025-ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? అక్కడ ఐదు రోజులు ఎందుకు జరుపుతారు?
తులా రాశి
ఆదిత్యుడు సంచారం తులారాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోనుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్ అద్భుతంగా సాగుతోంది. వైవాహిక జీవితంలో భార్యభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. కోరుకున్న వ్యక్తితో వివాహం కుదురుతుంది. భారీగా ధనార్జన చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి.
Disclaimer: ఈ వార్త మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించడమైనది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


