Saturday, November 15, 2025
HomeదైవంSuper Moon: కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృష్యం.. భూమికి అతి దగ్గరగా చంద్రుడు..!

Super Moon: కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృష్యం.. భూమికి అతి దగ్గరగా చంద్రుడు..!

Super Moon on Karthika Pounami: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ (బుధవారం) ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీన్ని బీవర్‌ సూపర్‌ మూన్‌ అని కూడా పిలుస్తారు. పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా వస్తాడు. ఆ సమయంలోనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. తలఅఈ సూపర్‌మూన్ అనేది ఈ ఏడాదిలో ఏర్పడబోయే రెండో అద్భుతమైన ఘట్టం. నార్త్‌ అమెరికాలోని స్థానిక తెగల నుంచి దీనికి బీవర్ సూపర్ మూన్‌గా పేరు వచ్చింది. వాస్తవానికి చంద్రుడు భూమి చుట్టు తిరిగే కక్ష్య అనేది పూర్తిగా వృత్తాకారంగా ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో మాత్రం భూమికి చంద్రుడు దగ్గరగా వస్తుంటాడు, అలాగే దూరంగా వెళ్తుంటాడు. అయితే, పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చిన వచ్చిన దృశ్యాన్నే సూపర్‌మూన్‌ అని పిలుస్తారు. ఆ సమయంలో భూమి నుంచి చంద్రుడు దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీనివల్ల సాధారణ పౌర్ణమి కన్నా చంద్రుడి ఆకారం 7 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ ప్రభావానికి చంద్రుడు 16 శాతం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. టెలీస్కోప్‌తో చంద్రుడి ఆకారాన్ని స్పష్టంగా చూడొచ్చు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/election-commission-clarifies-on-congress-mp-rahul-gandhi-allegations-of-vote-chori/

భూమికి చంద్రుడు మరింత దగ్గరగా..

గతంలో ఇలాంటి దృశ్యం చైనాలోని చెంగ్డులోని లాంగ్‌క్వాన్‌ పరత్వ ప్రాంతంలో ఆవిష్కృమైంది. ఈ సారి భూమికి చంద్రుడు మరింత దగ్గరగా ఉంటాడు. చల్లని శరదృతువు రాత్రిలో మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. ఈ సూపర్‌మూన్ ఈ ఏడాదిలో ఏర్పడనున్న మూడు సూపర్‌మూన్‌లో రెండోది. ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల నుంచి బీవర్‌ సూపర్‌ మూన్‌గా దీనికి పేరు వచ్చింది. బీవర్లు శీతాకాలంలో గుహలను నిర్మించే, నదులు గడ్డకట్టే ముందు వేటగాళ్లు ఉచ్చులు వేసే సీజన్‌ను ఇది సూచిస్తుంది. చంద్రుడు రాత్రంతా ప్రకాశవంతమైన రాశిచక్రం నక్షత్రరాశి వృషభంలో ఉంటాడు. ప్రకాశవంతమైన కాంతి సమీపంలోని నక్షత్రాలను అస్పష్టంగా చేస్తుంది. కానీ, టెలిస్కోప్‌ ద్వారా చంద్రుడిని చూస్తే నీరింజ, ఎరుపు నక్షత్రం ఆల్డెబరాన్‌ను చూడొచ్చు. ఇది భూమి నుంచి 65 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. చంద్రుడు, ఆల్డెబరాన్‌ మధ్య ప్లీయేడ్స్‌ ఉంటుంది. ఈ ప్లీయేడ్స్‌ను సెవెన్‌ సిస్టర్స్‌గా పిలుస్తారు. ఇది బిగ్‌ డిప్పర్‌ను పోలి ఉండే మెరిసే నక్షత్ర సమూహం. ఇది భూమి నుంచి 330 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. బీవర్‌ మూన్‌ను చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఆకాశం వైపుగా చూస్తే సరిపోతుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు (బుధవారం) సాయంత్రం 6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad