Sun Transit In Cancer 2025: జూలై నెల మెుదలైంది. ఈ నెలలో కీలక గ్రహ సంచారాలు జరగనున్నాయి. అందులో సూర్యుడి సంచారం ఒకటి. గ్రహాల రాజు అయిన ఆదిత్యుడు జూన్ 16న తన రాశిని మార్చనున్నాడు. భాస్కరుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అంటారు. సూర్యుడి కర్కాటక రాశి ప్రవేశం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
కన్యారాశి
కర్క సంక్రాంతి కన్యారాశి వారికి ఎంతో అదృష్టాన్ని తీసుకురాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కెరీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. అప్పులన్నీ తీరిపోయి.. ఆర్థికంగా బలపడతారు. ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సంతాన భాగ్యం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహ రాశి
సింహరాశి వారికి సూర్యుడి సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీకు లక్ కలిసి వచ్చి.. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు బోనస్ లభిస్తుంది.. ఆదిత్యుడు అనుగ్రహంతో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఊహించని ఆదాయం పొందుతారు. ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న దారిద్ర్యం పోయి.. మంచి రోజులు వస్తాయి. భార్యభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. జాబ్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృషభ రాశి
ఆదిత్యుడి అనుగ్రహంతో వృషభరాశివారు ధనవంతులు కానున్నారు. వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ లాభాలను పొందునున్నారు. సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. ఈ రాశి వ్యక్తులు ఏ పని చేపట్టినా అక్కడ వీరికి ప్రశంసలు పొందడం ఖాయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం మిమ్మల్నే వరిస్తుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు ప్రభ దీన్ని ధృవీకరించలేదు.)