Surya Mangal Yuti 2025:వేద జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు నవగ్రహాలలో అత్యంత ప్రధానమైన గ్రహంగా పరిగణించబడతాడు. గౌరవం, ప్రతిష్ఠ, ఆత్మవిశ్వాసానికి ఆయన ప్రతీకగా భావిస్తారు. మరోవైపు కుజుడు ధైర్యం, ఉత్సాహం, ఆస్తి వంటి అంశాలకు కారకుడిగా చెప్పబడతాడు. ఈ రెండూ ఒకే రాశిలో కలిసినప్పుడు వ్యక్తుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
సూర్యుడు, కుజుడు కలయిక..
2025 అక్టోబర్ నెలలో తులా రాశిలో సూర్యుడు, కుజుడు కలయిక జరగనుంది. ఈ యుతి కారణంగా కొన్ని రాశుల వారికి అనూహ్యమైన శుభఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాల్లో సానుకూల పరిణామాలు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ నాలుగు రాశుల వారికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో వివరంగా తెలుసుకుందాం.
Also Read:https://teluguprabha.net/devotional-news/durga-devi-dream-meaning-and-powerful-messages-in-dream/
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ యుతి ఆర్థికంగా, వ్యక్తిగతంగా సహాయకారిగా మారనుంది. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో సూర్యుడు, కుజుడు కలుస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలంలో లాభాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలనుకున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోతాయి. పెట్టుబడుల విషయంలో కూడా మంచి ఫలితాలు రావచ్చు. ఆస్తి సంబంధిత విషయాలలో లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ యుతి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి లగ్నంలోనే సూర్యుడు, కుజుడు కలుస్తున్నారు. ఈ సమయంలో వ్యక్తిగత ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు రావచ్చు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మీకున్న ప్రతిభకు సరైన గుర్తింపు వస్తుంది. మీ సామాజిక పరిచయాలు విస్తరిస్తాయి. వివాహం కానివారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వివాహితుల వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్య మంగళ యుతి ఆర్థికపరంగా అనుకూల ఫలితాలు ఇవ్వనుంది. ఈ రాశి నుంచి 11వ స్థానంలో ఈ కలయిక జరగబోతుంది. మీ ఆదాయం పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడులపై మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు లేదా వేతన పెంపులు సాధ్యమవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ యుతి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీపావళి తర్వాత కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం ఉంటుంది


