Surya Shani Yoga on Raksha Bandhan 2025: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 9న రాఖీ పండుగ రాబోతుంది. ఈ పవిత్రమైన రోజునే గ్రహాల రాజు అయిన సూర్యుడు, కర్మఫలదాత శనిదేవుడు అద్భుత కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంచారం అరుదైన నవపంచమ రాజయోగాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆదిత్యుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించస్తుండగా.. శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. రక్షా బంధన్ రోజున శని, సూర్యల నవపంచం యోగం ఏయే రాశులవారికి కలిసి రాబోతుందో తెలుసుకుందాం.
కన్య రాశి
రక్షా బంధన్ నుంచి కన్యా రాశి వారి అదృష్టం మారబోతుంది. వీరికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు. ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. నవపంచమ యోగం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి.
మీన రాశి
నవపంచం యోగం మీనరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి లాభాల బాట పడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సంతృప్తిని ఇస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్లాలన్న మీ కోరిక నెరవేరుతుంది.
మేషం
నవపంచమ రాజయోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూలత ఏర్పడుతోంది. కెరీర్లో ఊహించని గ్రోత్ ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని కలతలు తొలగిపోతాయి. మీరు చేసే పనిలో కొంత లక్ కూడా ఉంటుంది.
Also Read: Raksha Bandhan 2025 – రాఖీని ఎప్పుడు తీయాలి? రాఖీని ఎక్కువ కాలం ఉంచుకోవచ్చా?
మిథున రాశి
మిథునరాశి వారికి నవపంచమ యోగం అద్భుతంగా ఉండబోతుంది. ఆఫీసులో మీరు మంచి పొజిషన్ కు వెళ్లవచ్చు. ఉన్నతాధికారుల సపోర్టు మీకు లభిస్తుంది. కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకెళ్తారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.
సింహరాశి
రక్షా బంధన్ రోజున ఏర్పడబోతున్న అరుదైన యోగం కారణంగా సింహరాశి వారికి అదృష్టం పట్టనుంది. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. సొంత వ్యాపారం మెుదలుపెట్టాలనుకుంటే ఇదే సరైన సమయం. డబ్బు సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
Also Read: Festivals in August 2025- Telugu Prabha Telugu Daily అన్ని పండుగలు, వ్రతాలు ఆగస్టులోనే.. లిస్ట్ ఇదే!


