Friday, November 22, 2024
HomeదైవంSuryapeta: సీతారాముల కళ్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు

Suryapeta: సీతారాముల కళ్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు

ఈనెల 30న శ్రీరామనవమి సందర్భంగా నేరేడుచర్ల అయోధ్య కోదండ రామాలయానికి  శ్రీరామ నామాలు కలిగిన తలంబ్రాల  బియ్యపు గింజలను హైదరాబాద్ చందానగర్ కు చెందిన శ్రీరామ భక్తురాలు చలువాది మల్లి విష్ణువందన ఆలయ ధర్మకర్త పాల్వాయి రమేష్, అనిత దంపతులకు అందజేశారు.  ఈ సందర్భంగా విష్ణు వందన మాట్లాడుతూ 2016 నుండి బియ్యపు గింజలపై పవిత్ర  శ్రీరామ నామాలను తన స్వహస్తాలతో లిఖిస్తున్నానన్నారు.  ఇప్పటి వరకు 7 లక్షల 52 వేల 864 బియ్యపు గింజలపై అకుంఠిత దీక్షతో లిఖించానన్నారు. లిఖించిన బియ్యపు గింజలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని 30 ఆలయాలకు పైగా అందచేశానన్నారు.  భధ్రాద్రి ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణ వైభవంలో ఉపయోగించే తలంబ్రాల కొరకు 1,01,116 బియ్యపు గింజలను అందజేసినట్లు తెలిపారు.  వీటితో పాటుగా మరో 36 వేల శ్రీరామ నామాల బియ్యపు గింజలను ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డ, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట ప్రాంతాల్లోని 7 దేవాలయాల్లో నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం కొరకు సిద్దం చేశానని అవి కూడా ఆలయాలకు సమర్పిస్తానన్నారు.  నేరేడుచర్ల అయోధ్య కోదండ రామాలయానికి 5 వేలు, నూతనంగా నిర్మించిన గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ దేవాలయానికి 3 వేలు, దిర్శించర్ల గ్రామంలోని రామాలయానికి 10వేల గింజలను అందజేసినట్లు తెలిపారు.  ఇలాంటి కార్యక్రమాలతో నేటి యువతకు భగవంతుని పట్ల మక్కువ చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనకు దగ్గర చేయాలన్న సదుద్దేశంతో  బియ్యపు గింజలపై సూక్ష్మ కళతో శ్రీరామ నామాలను లిఖిస్తున్నాని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News