Friday, September 20, 2024
HomeదైవంTanduru: వైభవంగా భద్రేశ్వర స్వామి రథోత్సవం

Tanduru: వైభవంగా భద్రేశ్వర స్వామి రథోత్సవం

వికారాబాద్ జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న తాండూరు శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన స్వామివారి రథోత్సవం నిన్న అర్థరాత్రి 12 గంటల సమయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే నిర్వహించే స్వామి వారి రథోత్సవ వేడుకలను తిలకించేందుకు వేలాదిగా భారీ సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు. ఈ వేడుకలలో ముఖ్యాతిథులుగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర బిసి కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్, ఏఐసీసీ మెంబర్ రమేష్ మహారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు రథం ముందు నిర్వహించే పూర్ణకుంభం ఏర్పాటు, ప్రత్యేక మంగళ హారతి కార్యక్రమంలో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

అనంతరం భారీ జనసందోహం నడుమ భద్రేశ్వర స్వామివారి ఎతైన భారీ రథాన్ని భక్తులు, రథాన్ని నిష్ణాతులైన యువకులు ఉత్సాహంగా ముందుకు లాగారు. రథాన్ని ఆలయ ప్రాంగణం సమీపం నుండి బసవణ్ణకట్ట వద్ద ఉన్న బసవేశ్వరుడి ఆలయం వరకు లాగి, అనంతరం తిరిగి యథాస్థానానికి లాగటం ఆనవాయితీగా కొనసాగుతోంది. తాండూరు పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి పోలీసు బలగాలను రప్పించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. పట్టణ, రూరల్ సిఐలు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును జాతర కొనసాగే ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News