Saturday, November 15, 2025
HomeదైవంSpiritual: పాల మీద మూత తీసినా...?, కుక్క ఏడ్చినా ఆత్మలను ఆహ్వానించినట్లే..!

Spiritual: పాల మీద మూత తీసినా…?, కుక్క ఏడ్చినా ఆత్మలను ఆహ్వానించినట్లే..!

Indian Beliefs:పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలు ఇవాళ్టికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది వీటిని మూఢనమ్మకాలు అని అనుకుంటారు. కానీ అవి ఎందుకు మొదలయ్యాయో తెలుసుకుంటే వాస్తవానికి అవి అనవసరమైన భయాల వల్ల కాదు, జీవన విధానానికి అనుకూలంగా ఏర్పడ్డ జాగ్రత్తలు అని తెలుస్తుంది.

- Advertisement -

ఇల్లు ఊడ్చితే…

పూర్వం రోజుల్లో విద్యుత్‌ లైట్లు లేవు. సాయంత్రం తర్వాత ఇళ్లలో దీపాల వెలుగే ఉండేది. ఆ సమయంలో ఇల్లు ఊడ్చితే ఆ మసక వెలుగులో చిన్నచిన్న వస్తువులు పోయే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా వెండి, బంగారం లాంటి విలువైన వస్తువులు కూడా ఆ గుబురు కాంతిలో కనిపించక పోవచ్చు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చవద్దని చెప్పేవారు. దీన్ని ఇంటికి దురదృష్టం వస్తుందనే నమ్మకంగా మార్చేశారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/jammi-plant-benefits-and-vastu-rules-for-prosperity-at-home/

పాల గిన్నె మూత తీసి ఉంచితే..

రాత్రి సమయంలో పాల గిన్నె మూత తీసి ఉంచితే ఆత్మలు వస్తాయని పెద్దలు చెప్పేవారు. కానీ నిజానికి మూత లేకుండా ఉంచితే పాలు తేలికగా పాడవుతాయి, పైగా పురుగులు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే మూత లేకుండా పాలు ఉంచరాదని హెచ్చరించారు. ఈ మాటను ఆత్మల భయంగా మార్చారు.

ఆహారం తినకూడదనే

గ్రహణ సమయంలో ఆహారం తినకూడదనే నమ్మకం కూడా ఉంది. వాస్తవానికి ఆ సమయంలో సూర్యకాంతి లేకపోవడంతో వాతావరణంలో కలుషిత గాలులు వ్యాప్తి చెందుతాయి. ఈ ప్రభావం ఆహారంపై పడితే అది హానికరం అవుతుంది. అందుకే గ్రహణం సమయంలో వండిన ఆహారం, నిల్వ చేసిన ఆహారం తినొద్దని పెద్దలు చెప్పేవారు. దీన్ని కాలక్రమేణా శుభాశుభాలతో ముడిపెట్టారు.

విజిల్ వేయకూడదని

రాత్రి విజిల్ వేయకూడదని చెప్పడం కూడా ఒక విశేషం. ఆత్మలు ఆకర్షితులవుతాయని భావించేవారు. కానీ అసలు కారణం వేరే. రాత్రి సమయంలో విజిల్ వేస్తే దొంగలు అప్రమత్తం అవుతారు. మరోవైపు గ్రామాల్లో గస్తీ కాసేవారు విజిల్ వేసినప్పుడు అడవుల నుంచి జంతువులు బయటకు వచ్చి హాని చేసే అవకాశమూ ఉండేది. అందుకే రాత్రి విజిల్ వేయవద్దని హెచ్చరించేవారు.

గోర్లు కత్తిరించుకోవద్దని

సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించుకోవద్దని కూడా చెబుతారు. దీని వెనుక కారణం ఆ సమయంలో సరైన వెలుతురు లేకపోవడం. అప్పుడు గోర్లు కత్తిరిస్తే సులభంగా గాయాలు అవ్వచ్చు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే దాన్ని దురదృష్టంతో ముడిపెట్టారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/solar-eclipse-september-21-2025-precautions-for-pregnant-women/

దయ్యాలు వస్తాయని

రాత్రి రావి చెట్టు కింద నిద్రించడం వల్ల దయ్యాలు వస్తాయని నమ్మకం ఉంది. కానీ అది పూర్తిగా కట్టుకథ. రావి చెట్టు రాత్రి ఆక్సిజన్‌ ఇవ్వకుండా కార్బన్‌ డైయాక్సైడ్‌ విడుదల చేస్తుంది. ఆ గాలి ఎక్కువగా పీలిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి, ప్రాణహాని కలగొచ్చు కూడా. అందుకే ఆ చెట్టు కింద నిద్రించవద్దని చెప్పారు.

కుక్కలు ఏడిస్తే

కుక్కలు రాత్రి ఏడిస్తే ఏదో అశుభం జరగబోతోందని భావిస్తారు. నిజానికి కుక్కలకు ఇంద్రియాలు చాలా పదునుగా ఉంటాయి. మనిషికి తెలియని చిన్న శబ్దాలు, వాసనలు వాటికి వెంటనే తెలుస్తాయి. ఆ మార్పులను గ్రహిస్తూ కుక్కలు అరుస్తాయి. కాలక్రమంలో దీనిని కూడా మూఢనమ్మకంగా మార్చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad