ఏడుకొండలవాడు తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. వేసవికాలం కావడంతో శ్రీవారి దర్శనం కోసం తండోపతండాలుగా కొండకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ స్వామి వారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 12గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం అవుతోందిత. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎండ తీవ్రత తగలకుండా భక్తులకు అన్ని వసతులను టీటీడీ ఏర్పాటు చేసింది.
మరోవైపు కాసేపట్లో టీటీడీ పాలకమండలి(TTD) సమావేశం జరగనుంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి భేటీ కానుంది. సుమారుగా రూ.5,400 కోట్లు అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది టీటీడీ బోర్డు. 30కు పైగా అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది. వేసవి సెలవులు రద్దీకి సంభందించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.