Puri Jagannath Lucky Zodiac Signs: ఒడిశాలోని పూరీ జగన్నాథుడు రథయాత్ర అత్యంత వైభంగా సాగుతోంది. తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథాలపై గుండిచా అమ్మవారి ఆలయానికి వెళ్లాడు జగన్నాథుడు. అక్కడే వారం రోజులపాటు విడిది చేసి తొమ్మిదో రోజున ప్రధాన ఆలయానికి తిరిగివస్తారు స్వామివారు. దీంతో రథయాత్ర ముగుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్నాథుడుకు ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి.
సింహరాశి
జగన్నాథుడికి ఇష్టమైన రాశిచక్రాల్లో సింహరాశి ఒకటి. స్వామి వారి కృపతో వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ దారిద్ర్యం పోతుంది. బిజినెస్ లో ఇంతకముందు ఎప్పుడూ చూడనన్ని లాభాలను చూస్తారు. వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. లక్ ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. వాసుదేవుడు ఈ సమయంలో చేసే పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చేలా చూస్తాడు.
కర్కాటక రాశి
జగన్నాథుడికి ఇష్టమైన రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. ఈ రాశివారిపై స్వామివారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరికీ ధనధాన్యాలకు లోటు ఉండదు. మీరు ఏ కార్యం చేపట్టినా అది సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారు. స్వామి అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి కష్టాలు రావు. సంతానాన్ని ఇస్తాడు. వైవాహిక జీవితంలో సమస్యలను తొలగిస్తాడు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులను దూరం చేస్తాడు. నిరుద్యోగులు ఉద్యోగం దొరికేలా చేస్తాడు. మీకు ఎల్లప్పుడు అదృష్టాన్ని ఇస్తాడు.
తులారాశి
జగన్నాథుడు కరుణామయుడు. తులారాశి వారంటే ఆయనకు ఎంతో ప్రీతి. దీంతో స్వామివారు మీ కష్టాలను దూరం చేసి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు. మీ సంపదను పెంచుతాడు. ప్రతి పనిలో విజయాన్ని చేకూరుస్తాడు. ఆయన ఆశీర్వాదఫలంతో మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. ఉద్యోగం సాధించాలనే నిరీక్షణ ముగుస్తుంది. భార్యభర్తల మధ్య గొడవలు సర్థుమణుగుతాయి.