Sunday, January 19, 2025
HomeదైవంPuja: పూజ సమయంలో ఈ శకునాలు అశుభమంట.. అవి ఏంటంటే..?

Puja: పూజ సమయంలో ఈ శకునాలు అశుభమంట.. అవి ఏంటంటే..?

హిందూ మతంలో దేవుని ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా భగవంతుడిని ఆరాధిస్తారు. కానీ అందరూ చేస్తారు. దీపం, ధూపం, హారతి, ప్రసాదానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ పాటిస్తారు. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని శకునాలు శుభకరమైనవి, కొన్ని అశుభమైనవి అని చెబుతాము. కానీ నేటికీ చాలా మందికి వీటి గురించి పెద్దగా తెలియదు. అటువంటి పరిస్థితిలో పూజ సమయంలో ఎలాంటి శకునాలు అశుభంగా భావిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం.

- Advertisement -

మానవ జీవితంలో దేవతల ఆరాధన చాలా ముఖ్యమైనదని జ్యోతిష్కులు చెపుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన దేవుడిని ఆరాధిస్తారు. పూజ సమయంలో కొన్ని చిహ్నాలు శుభప్రదమని చెపుతారు. ముఖ్యంగా కొబ్బరికాయను పూజా సమయంలో ప్రధానంగా ఉపయోగిస్తారు. దీనిని శ్రీఫల్ అని కూడా అంటారు.

అయితే కొబ్బరి కాయను కొట్టినప్పుడు అది పాడైపోతే.. దానిని అశుభ సంకేతంగా చూస్తారు. ఇలా జరిగితే మీ ఆరాధనలో ఏదో లోపం ఉందని అర్థం అంట. అదే విధంగా కొబ్బరి కాయలో పువ్వు వస్తే మీ పూజకు దేవుడు సంతోషించాడని అర్థమంట. అంతేకాకుండా పూజా సమయంలో దీపం ఆరిపోవడం కూడా అశుభంగా భావిస్తుంటారు. ఇలా జరిగితే ఆ ఇంటి యజమాని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందంట. అంతేకాదు ఇంటి పెద్దకు కీడు జరుగుతుందని కొందరు నమ్ముతారు. ఇక పూజ చేస్తున్నప్పుడు కుంకుమ భరిణి కింద పడి ఒలిగిపోవడం కూడా అశుభానికి చిహ్నం.. ఇది జీవితంలో సమస్యకు కారణమని పండితులు అంటున్నారు.

ఇక శుభ శకునాల విషయానికి వస్తే.. పూజ సమయంలో దేవుళ్ల విగ్రహాల నుంచి పూలు రాలడాన్ని శుభసూచకంగా భావిస్తారు. అదే విధంగా దేవుని ఎదుట వెలిగించే దీపం పూర్తిగా కాలిపోయినా దానిని శుభసూచికంగా భావిస్తారు. ఇలా జరిగితే మీపై దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థమంట. ఇలాంటి సంవదర్భంలో దేవుడు మీ ప్రార్థనను అంగీకరించాడని, మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News