Shukra Gochar In Taurus 2025: ఆస్ట్రాలజీలో నవగ్రహాలుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఏ ఒక్క గ్రహ గమనంలో మార్పు వచ్చినా అది మెుత్తం 12 రాశులవారి జీవితాలను తారుమారు చేయగలదు. ఇటీవల సంపదను ఇచ్చే శుక్రుడు మేషరాశిని విడిచిపెట్టి తన సొంతరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఈ దృగ్విషియం జూన్ 29న చోటుచేసుకుంది. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏవి, అందులో మీది ఉందా లేదో తెలుసుకోండి.
మేష రాశి
శుక్ర సంచారం మేషరాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. జూలైలో ఈరాశి వారు పలు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులు వారి బాస్ చేత ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సంతోషం తాండవిస్తోంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో సక్సెస్ అవుతారు. ఆర్థికంగా మీ పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. అప్పుల భారం తగ్గుతుంది. దాంపత్య జీవితం సాపీగా సాగుతోంది. మీ కెరీర్ లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటారు.
వృశ్చిక రాశి
శుక్రుడి యెుక్క రాశి మార్పు వృశ్చిక రాశి వారికి గోల్డెన్ డేస్ తీసుకురాబోతుంది. వీరు అప్పులన్నీ తీరిపోయి.. త్వరలోనే ధనవంతులు కాబోతున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. సంతానభాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది. మీకు అనేక రకాలుగా డబ్బు వచ్చి పడుతుంది. మీ భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహ ప్రతిపాదన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కుతారు.
కర్కాటక రాశి
సొంత రాశిలో శుక్రుడి ప్రవేశం కర్కాటక రాశివారికి ఎనలేని లాభాలను ఇస్తుంది. డబ్బు దుబారాను తగ్గించుకుంటే మిమ్మల్ని ఆపేవారు ఎవరూండరు. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆదాయం మునుపటి కంటే భారీగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి సడన్ గా శుభవార్త వినే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కల నెరవేరే సమయం అసన్నమయింది. మిమ్మల్ని చిన్నచూపు చూసినవారే మెచ్చుకునే రోజులు వస్తాయి.
Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్, సాధారణ నమ్మకాలు, సనాతన సంప్రదాయాలు ఆధారంగా తీసుకోబడింది. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.